మమత బెనర్జీని హతమార్చేందుకు కుట్ర..? Plane carrying Mamata Banerjee hovers in sky, TMC alleges conspiracy

Plane carrying mamata banerjee hovers in sky tmc alleges conspiracy

mamta banerjee, BJP, PM Modi, Pradhan Mantri Jan-Dhan Yojana, RBI, Specified Bank Notes, Cash withdrawal, RBI, Jan Dhan accounts, demonetisation, withdrawal limit, KYC norms, Reserve Bank of India, banknotes, currency

A private airline plane carrying West Bengal Chief Minister Mamata Banerjee hovered for over half an hour in the city sky before landing at the NSCBI Airport in Kolkata

మమత బెనర్జీని హతమార్చేందుకు కుట్ర..?

Posted: 12/01/2016 11:01 AM IST
Plane carrying mamata banerjee hovers in sky tmc alleges conspiracy

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని హతమార్చేందుకు పెద్ద కుట్ర చేశారా.? అంటే అవుననే సమాధానాలనే తృణముల్ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నాయి. కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా అమె తన అందోళన క్రమాన్ని మార్చారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రారంభమైన అమె అందోళనలు.. అటు దేశరాజధాని ఢిల్లీ విధుల్లోకు కూడా చేరాయి. అయినా అమె తన స్వరాన్ని మర్చాలేదు. పెద్ద నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్ర దాగివుందని అమె తీవ్రస్థాయిలో అరోపణలు గుప్పిస్తున్నారు.

రద్దు నిర్ణయానికి ముందు ఆరు మాసాల నుంచి దేశంలోని అన్ని బ్యాంకు అకౌంట్లలో లావాదేవీలను పరిశీలించాలని, ముఖ్యంగా బీజేకి చెందిన ఎంపీలు, మంత్రులు, మిత్రపక్షాల, ఆ పార్టీకి చెందిన స్పాన్సర్లు అకౌంట్లను పరిశీలిస్తే పూర్తి సమాచారం వెల్లడవుతుందని అమె అరోపించారు. అంతేకాదు.. ఇప్పటికే బీజేపి దేశవ్యాప్తంగా పలు పట్టణాలు, నగరాలలో పెద్ద ఎత్తున భూములు, అస్తులను కొనుగోలు చేసిందని కూడా అమె ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె నిన్న బీహార్ లో కూడా ముమ్మర ప్రచారం నిర్వహించి అరోపణలు గుప్పించారు.

కేంద్ర నిర్ణయాన్ని, మోడీ ప్రభుత్వ తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతున్న అమెను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని కూడా అరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో అమె ప్రయాణిస్తున్న ఇండిగో విమానం కోల్‌కతా విమానాశ్రయం వద్ద దాదాపు అరగంట పాటు ల్యాండింగ్ కాకుండా గాలిలో చక్కర్లు కొడుతూనే ఉంది. పెద్దనోట్ల రద్దుకు నిరసనగా బిహార్‌లో నిర్వహించిన ర్యాలీ అనంతరం రాత్రి 7.35 గంటల సమయంలో మమత అక్కడ విమానం ఎక్కారు.

వాస్తవానికి అది 6.35కే రావాల్సి ఉంది. తర్వాత సాంకేతిక కారణాల వల్ల విమానం అరగంట పాటు గాల్లోనే తిరుగుతూ 9 గంటల సమయంలో ల్యాండయింది. ఏ విమానాశ్రయంలో అయినా ఇలాంటి ఘటనలు మామూలేనని విమానాశ్రయ అధికారులు చెబుతున్నా.. తృణముల్ నేతలు మాత్రం తమ అధినేత్రి కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తరుణంలో అమెను హతమార్చేందుకు కుట్ర జరుగుతుందని అరోపిస్తున్నారు.
 
ఏటీసీ నుంచి అనుమతి రాకపోవడం వల్లనే విమానం కిందకు దిగలేదని అధికారులు చెబుతున్నా, ఇదంతా మమతను హతమార్చేందుకు జరగుతున్న కుట్రేనని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్ హమీక్ ఆరోపించారు. ఆయన కూడా మమతతో పాటే విమానంలో వచ్చారు. తాము ఐదు నిమిషాల్లో కోల్‌కతా వస్తామని పైలట్ 180 కిలోమీటర్ల ముందే చెప్పారన్నారు. అయినా విమానం అరగంట ఆలస్యంగాకిందకు దిగడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు.

విమానాశ్రయ అధికారుల చర్యల వల్ల తమ అధినేత్రి మమతా బెనర్జీతోపాటు ఇతర ప్రయాణికులకు కూడా తీవ్ర అసౌకర్యం కలిగిందని అయన అన్నారు. విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్ చెప్పినా.. ఏటీసీ మాత్రం విమానాన్ని గాల్లోనే ఉంచేసిందని ఆయన ఆరోపించారు. ఇది ముఖ్యమంత్రిని చంపడానికి చేసిన కుట్ర తప్ప మరొకటి కానే కాదని అయన అరోపించారు. కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పితే.. నిజాలు చెప్పాల్సిన కేంద్రం.. ఉద్యమించిన నేతలను హతమార్చేందుకు కుట్ర పన్నుతుందని... ప్రజా ఉద్యమాన్ని చేపట్టిన తమ అధినేత్రి మమతను  చంపాలనుకుంటున్నారని హకీమ్ అరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mamta banerjee  RBI  PM Modi  cash withdrawl limits  jan dhan accounts  currency  demonetisation  

Other Articles