అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్లీ ఒబామా రాజకీయ భవితవ్యంపై వస్తున్న వార్తలపై తాజాగా మరోమారు క్లారిటీ ఇచ్చేశారు. 2020లోజరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రస్తుత అమెరికా ప్రధమ పౌరురాలు మిచెల్లీ బరిలో ఎట్టి పరిస్థితులలో నిలువరని ఆయన స్పష్టం చేశారు. ఇది వరకు ఈ విషయాన్ని చెప్పినా.. ఆ తరువాత అమె అమెరికా వాసులతో త్వరగా మమేకమైయ్యారని, త్వరలో బరిలో నిలుస్తారని ఒబామా సరదాగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అలాంటిదేమీ లేదని తాజాగా రోలింగ్ షటర్స్ ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
అయితే ఇటీవల ముగిసిన తాజా అమెరికా ఎన్నికలలో మిచెల్లీ డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తరుపున ప్రచారాన్ని కూడా నిర్వహించారు. దీంతో అమె నాలుగేళ్ల తరువాత రానున్న అగ్రరాజ్య ఎన్నికలలో బరిలో నిలుస్తారని, పలు రకాల వార్తలు తెరపైకి వచ్చాయి. దీనికి బలం చేకూర్చే మాదిరిగా.. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మిచెల్లీకి మంత్రి పదవి ఇస్తారని కూడా వార్త కథనాలు వచ్చాయి.
ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ క్లింటన్ పరాజయం పాలవ్వడంతో ఆ ఆశలపై నీల్లు పడ్డాయి. కాగా, వచ్చే ఎన్నికల్లో మిచెల్లీ ఒబామా పోటీచేస్తారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒబామా దీనిపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మిచెల్లీ ఎప్పుడూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని మరోమారు స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే అసలు మీటను నోక్కారు.
మిచెల్లీ రాదు.. రాదు అంటూనే వస్తుందన్న సంకేతాలను ఆయన పరోక్షంగా ఇస్తున్నారా..? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అగ్రరాజ్య రాజకీయ విశ్లేషకులు. కుండబద్దలు కోట్టినట్లు అయన చెప్పినా.. నాలుగేళ్ళ తరువాత అమెరికాలో వుండే రాజకీయ పరిస్తితులను బట్టి.. రాజకీయంగా బరిలోకి దిగక తప్పని పరిస్థితులు వచ్చాయన్న అమె క్లారిటీ ఇవ్వచ్చునని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
అందుకోసమే ఒరాక్ ఒబామా మిచెల్లీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆమె చాలా ప్రతిభావంతురాలని, అమెరికా ప్రజలతో మమేకమయ్యారని ఒబామా ప్రశంసించడం కూడా అమె రాజకీయాల్లోకి వస్తారనేందుకు సంకేతాలుగా వారు పేర్కోంటున్నారు. ఇప్పటి వరకు ఒబామా మాత్రమే మిచెల్లీ రాజకీయాల్లోకి రాదని చెబుతూ వస్తున్నారని.. కానీ అయన సతీమణి మిచెల్లీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. ఇదే అమె రాజకీయ అరంగ్రేటానికి సంకేతమని కూడా రాజకీయ విశ్లేషకులు భావన.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more