బాబుకే ఆ లక్. ప్చ్.. కేసీఆర్ కాస్త లేట్ అయ్యాడు | Chandrababu heads KCR late.

Modi wants chandrababu to solve demonetization crisis

Andhra Pradesh, Chief Minister Chandrababu Naidu, AP CM chandrababu naidu, Centre's panel on note ban, Chandrababu Noteban panel, CM Chandrababu Naidu heads Centre's panel, Modi Confidence on Chandrababu, PM Modi Chandrababu, Chandrababu leads CMs

Andhra Pradesh CM Chandrababu to head panel to on problems caused by demontization

బాబుపై మోదీకి ఎందుకంత కాన్ఫిడెన్స్?

Posted: 11/29/2016 03:36 PM IST
Modi wants chandrababu to solve demonetization crisis

ఓవైపు పెద్దనోట్ల ర‌ద్దు వ్యవహారం పూర్తిగా రాజకీయాంశంగా మారిపోయింది. దీనిని ఆసరాగా చేసుకుని శీతాకాల సమావేశాలు జరగకుండా ప్రతిపక్షాలు పార్లమెంట్ ఉభయ సభలను అడ్డుకునేందుకు శాయశక్తుల కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో పెరిగిపోతున్న వ్యతిరేకతను కాస్తైనా తగ్గించేందుకు మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

పెద్ద నోట్ల రద్దు, ఆపై నెలకొన్న పరిస్థితులను అధ్య‌య‌నం చేసి ఓ సమగ్ర నివేదిక తయారు చేయించుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఏ కమిటీ ఏర్పాటు చేసింది. న‌గ‌దు ర‌హిత లావాదేవీలు, కార్డుల వినియోగం అంశాల‌ను ప్రోత్స‌హించ‌డంపై క‌మిటీ స‌మ‌గ్రంగా ప‌రిశీల‌న జ‌రిపి కేంద్ర ఆర్థిక శాఖ‌కు నివేదిక ఇవ్వ‌నుంది. మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలు ఉండే ఈ క‌మిటీకి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నాడు. ఈ క‌మిటీలో స‌భ్యులుగా చంద్ర‌బాబుతో పాటు మ‌ధ్యప్ర‌దేశ్‌, ఒడిశా, పుదుచ్చేరి, త్రిపుర, బీహార్ సీఎంలను నియ‌మించారు.

ఎన్టీయే లో భాగస్వామిగా ఉండటమే కాదు, మొదటి నుంచి పెద్ద నోట్ల రద్దును చంద్రబాబు సమర్థిస్తూ వస్తున్నాడు. అంతేకాదు మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా ఆర్థిక స్థితిపై కాస్త అసంతృప్తితో ఉన్నప్పటికీ, బాబు మాత్రం కాస్త ఓపిక పట్టాలంటూ ప్రజలకు ఎప్పటికప్పుడూ పిలుపు ఇస్తూనే ఉన్నాడు. మరోవైపు అసలు పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య డిస్కషన్లు జరుగుతున్నాయన్న వాదన కూడా ఒకటి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎంను మించి మరోకరు ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేరన్న భావనకు వచ్చిన మోదీ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

మరోపక్క ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తున్న నితీశ్ కుమార్ లాంటి వాళ్లను సభ్యులుగా చేర్చాలన్న నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరితోపాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రస్తుత ఆందోళనకు దూరంగా ఉన్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, మరియు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులను కూడా ఇందులో సభ్యులుగా ఆహ్వానించాలని మోదీ సర్కార్ డిసైడ్ అయ్యింది. తద్వారా ప్రతిపక్షాలపై పరోక్షంగా పై చేయి సాధించొచ్చనే ధీమాలో ఉంది.

మరోపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మోదీ తీసుకున్న నిర్ణయం తాజాగా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ను కూడా చివరి నిమిషంలో చేర్చే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆయా రాష్ట్రాల సీఎంలతో ఫోన్లో మాట్లాడినట్లు, వ‌చ్చేనెల 2వ తేదీన‌ ఈ క‌మిటీ స‌మావేశం అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  CM Chandrababu  Note Ban  Chief Ministers panel  Head  

Other Articles