బీజేపి ఎంపీలకు, మంత్రులకు ప్రధాని మోడీ డైడ్ లైన్ PM to BJP MPs, MLAs: Reveal bank a/c details from Nov 8 to Dec 30

Pm modi asks bjp mlas and mps to submit their bank transaction details

Currency ban, Notes Ban, Arun jaitley, BJP MPs, BJP MLAs, BJP Cental and state Ministers, BJP Union ministers, digital transactions, Cashless Society, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, atm withdrawal charges, atm withdrawal limits, india news

Prime Minister Narendra Modi has asked the MPs and MLAs of his party to submit details of their bank account transactions between November 8 and December 31 to party president Amit Shah.

ఇక బీజేపి ఎంపీలు, మంత్రుల వంతు వచ్చేసింది..

Posted: 11/29/2016 03:37 PM IST
Pm modi asks bjp mlas and mps to submit their bank transaction details

పెద్ద నోట్ల రద్దుతో దేశంలోని అవినీతి, నల్లధనంపై యుద్దం సాగించడంలో ఎటువంటి పరిస్థితులలో వెనుకంజ వేసేది లేదని తేల్చిచెప్పిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. ఈ దిశగా మరో ముందడుగు వేశాడు. ఇప్పటికే నోట్ల రద్దు విషయంలో ముందుగానే తమ అనుకూలురైన పారిశ్రామిక వేత్తలకు, పార్టీ నేతలకు సమాచారం అందించారని విపక్షాలు అరోపణలు గుప్పిస్తున్న తరుణంలో వాటిని తోసిరాజుతూ ప్రధాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

నల్లధనం, అవినీతి విషయంలో ఆయన బీజేపీ ఎంపీలు, బీజేపి అధికారంలో వున్న రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. బీజేపి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల అమాత్యులు అందరూ తమ బ్యాంకు ఖాతాల్లోని లావాదేవీల వివరాలను డిసెంబర్ 31లోగా వెల్లడించాలని మోదీ ఆదేశించారు. బీజేపీ ప్రజా ప్రతినిధులు నవంబర్‌ 8 నుంచి డిసెంబర్‌ 31 వరకు తమ బ్యాంకు లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు సమర్పించాలని సూచించారు.

పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పారదర్శకంగా ఉండేందుకు బీజేపీ చట్టసభ సభ్యులు బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించాలని మోదీ ఆదేశించారు. అయితే ఈ సంచలన నిర్ణయాన్ని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నెల 8 నుంచి డిసెంబర్ 31 వరకు బీజేపి ఎంపీలు, ఎమ్మెల్యేల లావాదేవీల వివరాలకు బదులు.. డిసెంబర్ కు ముందు నాలుగు నెలల లావాదేవీల వివరాలను అడిగితే బాగుండేదని దుయ్యబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles