మమతా మంగమ్మ శపథం.. మోదీ అంటే ఎందుకు మంట? | Mamata Benarjee strong warning to Modi.

Mamata banerjee attacks pm modi on demonetisation

West Bengal CM Mamata Benarjee, PM Modi, demonetisation, Aakrosh diwas, Mamata Benarjee Aakrosh diwas Rally

Mamata Benarjee attacked on Modi. Acted like God on demonetisation, no place for 'dictators' like him.

మోదీకి ఇలాంటి వార్నింగ్ ఫస్ట్ టైం

Posted: 11/28/2016 04:01 PM IST
Mamata banerjee attacks pm modi on demonetisation

మోదీ పెద్ద నోట్ల రద్దుపై ఇలా ప్రకటన చేయగానే ఏం వ్యాఖ్యలు చేయాలా అని తోటి నేతలంతా ఆలోచించుకుంటున్న తరుణంలో ఫస్ట్ విమర్శలు గుప్పించింది పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అంతటితో ఆగేనా.. విపక్షాలన్నింటిని కూడగలుపుకుని రాష్ట్రపతి దగ్గరికి మార్చ్ గా వెళ్లి ఫిర్యాదు చేయటం, లోక్ సభను స్థంభింపజేయాలంటూ నేతలందరికీ నూరిపోయటం లాంటివి చాలానే చేసింది.

ఇక విబేధాలను పక్కనపెట్టి మరీ రాష్ట్రంలో ప్రతిపక్షాలుగా ఉన్న వామపక్షాలను కూడగలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తోంది. భారత్ బంద్ లో భాగంగా లక్ష మందితో ఆమె చేసిన ఆందోళనకు స్పందన బాగానే వచ్చింది. ఈ సందర్భంగా ప్రసంగం చేసిన మమతా మోదీపై కాస్త ఘాటు వ్యాఖ్యలే చేసింది.

ఏదో దేవుడిలాగా ఫీలయిపోతూ నోట్ల రద్దు గురించి అర్థం పర్థం లేని ప్రకటన ఒకటి చేసేశాడు. అసలు దేశ వ్యాప్త చర్చ చేపట్టకుండానే 500, 1000 నోట్లు రద్దు చేసి పడేశాడు. ప్రజలు వీధిన పడి కష్టాలు ఎదుర్కుంటున్నారంటూ విమర్శించారు. తాను బతికినా, చనిపోయినా ఫర్వాలేదు కానీ, ప్రధాని మోదీని దేశ రాజకీయాల్లో లేకుండా చేస్తానని ప్రతిన బూనుతూ... ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ లాంటి నియంతలు భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశానికి అక్కర్లేదంటూ విరుచుకుపడ్డారు.

కాగా, పెద్దనోట్ల రద్దును నిరసిస్తూ ప్రతిపక్షాలు ఈరోజు భారత్ బంద్ నకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రతిపక్షాల్లో ఏకాభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడంపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతా ఒకే తాటిపై ఉంటామని ముందు చెప్పినవారు, వెనకాల వేరేలా ప్రవర్తించారంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా ఇప్పటిదాకా ప్రతిపక్ష కాంగ్రెస్, మరో ప్రత్యర్థిగా తయారయిన ఆప్ కూడా ఈ స్థాయి విమర్శలు చేయలేదనే చెప్పుకోవాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal CM  Mamata Benarjee  PM Narendra Modi  demonetisation  Aakrosh diwas Rally  

Other Articles