ములాయం కాదన్నాడు.. అయినా అఖిలేష్ పెళ్లి చేయించా... తట్టుకోలేకపోతున్నా | Amar Singh says pained by 'intolerable abuses' by Akhilesh gang.

Amar singh complaints mulayam at akhilesh yadav

Amar Singh, Akhilesh Yadav, Mulayama Singh, Amar Singh Netaji, Amar Singh Akhilesh Yadav Marriage, Amar Singh Mulayam Singh, Uttara Pradesh Chief Minister Akhilesh Singh Yadav, Samajwad Party, UP elections 2017

Amar Singh syas "There's a limit to insults I can bear from Akhilesh Yadav and his supporters".

నేతాజీ! ఏదో ఒకటి చేయండి ప్లీజ్...

Posted: 11/28/2016 01:45 PM IST
Amar singh complaints mulayam at akhilesh yadav

ఓవైపు యూపీ ఎన్నికల సమరం దగ్గర పడుతోంది. మరోవైపు ములాయం ఇంట ముసలం ఓ కొలిక్కి వచ్చిందనుకునేలోపే మళ్లీ అగ్గి రాజేసుకుంటోంది. అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ యాదవ్ మరోసారి తన అసంతృప్తిని వెల్లగక్కాడు. తాను ఎంత అదుపులో ఉంటున్నా.. సీఎం అఖిలేష్ యాదవ్, అతని అనుచరులు అమర్ ను అవమానించాలని చూస్తున్నారంటూ వాపోతున్నాడు.

దేనికైనా ఒక హద్దు ఉంటుందని, ఆ మేరకు మాత్రమే భరించగలమని, ఈ విషయంలో ఏం చేయమంటారో చెప్పండంటూ ఆయన సోమవారం పార్టీ చీఫ్‌ ములాయం సింగ్‌తో భేటీ అయ్యారు. ‘నాకు అఖిలేశ్‌ ను బాధపెట్టడం ఇష్టం లేదు. కానీ నా సహనాన్ని మించిన అవమానాలు ఎదురయ్యాయి. నా మనసు గాయపడింది. నేను ములాయంతో మాట్లాడుతాను. కుమారుడిని కూడా కాదని నేరుగా నాకు మద్దతిచ్చిన వ్యక్తి ములాయం. ఆయన ఏది చెప్తే అదే చేస్తాను’ అని అమర్‌ సింగ్‌ ములాయంను కలవకముందు మీడియాతో చెప్పారు.

అవమానాలు ఎదురవుతున్న నేపథ్యంలో రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించగా ములాయంను గాయపరిచే ఏ చర్యలను తాను చేయబోనని ఆయన చెప్పారు. ‘నేను అఖిలేశ్‌ తో ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికీ ములాయంతోనే ఉంటాను. అయినప్పటికీ నేను ఎప్పుడు ఏం మాట్లాడినా అఖిలేశ్‌కు అనుకూలంగా మాట్లాడతాను. నేతాజీకి నేనేమిటో పూర్తిగా తెలుసు’ అని ఆయన చెప్పారు.

అఖిలేష్ పెళ్లి సమయంలో ఇంట్లో వాళ్లు అభ్యంతరం చెప్పినప్పటికీ, తాను అండగా నిలిచి చేయించాను. అలాంటిది నన్ను దళాల్ అంటూ అఖిలేష్ వ్యాఖ్యానించడటం దారుణం. నా త్యాగమే అన్ని సమస్యలకు పరిష్కారం అంటే అందుకు నేను సిద్ధం అంటూ అమర్ సింగ్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP elections 2017  Samajwadi Party  Amar Singh  Mulayam Singh Yadav  Akhilesh yadav  

Other Articles

Today on Telugu Wishesh