కొత్త రూ.500 నోటుపై అనుమానాలు.. బ్యాంకుల్లో రద్దు నోట్లకు చెల్లు.. no exchange of scraped currency in banks

No exchange of scraped currency in banks

Currency ban, Notes Ban, demonetisation, withdrawal limit, currency exchange, old currency exchange, banks, petrol pumps, pharmacies, mobile phone recharges, school fees, Prime Minister Narendra Modi, demonetisation, parliament session, congress, rbi rules, pm modi demonetisation, demonetisation rules, atm withdrawal charges, atm withdrawal limits, india news

Banks will stop exchanging old Rs 500 and Rs 1,000 notes, but exemptions given at petrol pumps, pharmacies, mobile phone recharges and school fees until December 15.

కొత్త రూ.500 నోటుపై అనుమానాలు.. బ్యాంకుల్లో రద్దు నోట్లకు చెల్లు..

Posted: 11/25/2016 11:13 AM IST
No exchange of scraped currency in banks

అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం, అంతర్గత తీవ్రవాదం ఇలా పలు అంశాలపై పోరాటం చేయడంలో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న సాహపోపేత నిర్ణయం ప్రజల పాలిట శాపంగా మారింది. స్వయంగా నరేంద్రమోడీ ప్రకటించిన విధివిధానాలలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నవంబర్ 8న రాత్రి 8 గంటలకు అయన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత.. రంగంలోకి దిగిన అర్బీఐ ఈ నెల 24 వరకు బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవచ్చునని ప్రకటించారు. నవంబర్ 24 వరకు నాలుగు వేల రూపాయలను మార్చుకునే వెసలుబాటు కల్పించగా, నవంబర్ 24 తరువాత ఈ పరిమితిని 8 వేలకు పెంచుతామని చెప్పారు.

ఈ నేపథ్యంలో బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడిన జనసంద్రాని చూసిన పలువురు.. తమ ఉద్యోగాల నేపథ్యంలో తరువాత మార్చుకుందాం అని నోట్ల మార్పిడిని వాయిదా వేసుకున్నారు. అయితే అలాంటివారందరికీ ఇది చేదు వార్త. ఇకపై బ్యాంకుల్లో నోట్ల మార్పిడి వుండదు. ఇవాళ పాత నోట్లను మార్పు చేసుకుందామని అశగా బ్యాంకుల ముందు క్యూ కట్టిన వారందరూ.. నోట్లను మర్చుకునే వెసలుబాటు రద్దు చేశారన్న బ్యాంకు అధికారుల మాటలు విని నిశ్చేష్టులయ్యారు.

నోట్ల మార్పిడి విషయంలో కేంద్రం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని, తలా తోకా తెలియకుండా కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ పాలిట శాపంగా మారుతుందని ప్రజలు కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవాళ్టి నుంచి పాతనోట్ల మార్పిడిలో పరిమితి పెంచుతామని చెప్పిన కేంద్రం.. అ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం, బ్యాంకుల్లో అసలు మార్పిడే లేదని ఇవాళ ఉదయం ప్రకటించడంతో కేంద్రంలో తిక్క శంకరయ్య పాలన సాగిస్తున్నారన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఇక కేంద్రం అందుబాటులో వచ్చేశాయని ఈ నెల 10 తేదీ నుంచే ప్రచారం చేసుకున్నా.. నిజానికి 20 తేదీ తరువాతే ప్రజల కంటపడుతున్న రూ.500 కొత్త కరెన్సీ నోటుపై కూడా ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతుంది. రెండు విభిన్న డిజైన్లలో ఈ నోటును ముద్రించడంతో.. ఏదీ అసలు, ఏది కాదు అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ రెండు అసలీ నోట్లేనని, రెండు డిజైన్లలో వాటిని ముద్రించామన్న అర్బీఐ వివరణ ఇచ్చుకోవల్సిన అవసరం ఏర్పడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles