రతన్ టాటా ఇగోతో టీసీఎస్ సర్వనాశనం అయ్యేదంట! | Ratan Tata's ego caused financial mess for group firmsCyrus Mistry.

Cyrus mistry again comments on ratan tata

Cyrus Mistry, Ratan Tata, TCS to IBM, Cyrus Mistry Ratan Tata, Ratan Tata ego

Cyrus Mistry says Ratan Tata tried to sell TCS to IBM.

రతన్ టాటాపై సంచలన వ్యాఖ్యలు

Posted: 11/23/2016 04:59 PM IST
Cyrus mistry again comments on ratan tata

టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ, రతన్ టాటాల యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసేలా కనిపించటం లేదు. మరోసారి సైరస్‌, టాటాపై ఆరోపణల జడివాన కురిపించారు. రతన్‌ టాటా అహంకార పూరిత నిర్ణయాలు తీసుకుంటారని, ఈ కారణంగా ఎన్నో నష్టాలు జరిగాయని ఆరోపించారు. టిసిఎస్‌, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ విషయంలో తాను పట్టనట్లు వ్యవహరించానన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఒక దశలో రతన్‌ టాటానే టీసీఎస్ ను ఐబిఎంకు అమ్మేయాలని యత్నించాడని ఆరోపించారు.

తాను ఈ రెండు కంపెనీల ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దానని, తన ప్రయత్నాల వల్లనే టిసిఎస్‌ ప్రత్యేక డివిడెండ్‌ ఇచ్చేస్థాయికి ఎదిగిందని చెప్పుకున్నారు. రతన్‌ తన ఇగోతో అనేక చెడ్డ నిర్ణయాలు తీసుకున్నారని, వీటిలో కోర్‌సను రెట్టింపు విలువ వెచ్చించి కొనుగోలు చేయడం ఒకటని దుయ్యబట్టారు. తన హయంలో టీసీఎస్, జెఎల్‌ఆర్‌ పట్ల నిర్లిప్తంగా వ్యవహరించానని పదేపదే అసత్య ప్రచారం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ వివరాలన్నింటితో సైరస్‌ ఒక లేఖను విడుదల చేశారు. ఇలా వివరణల పేరిట సైరస్‌ లేఖల ద్వారా రతన్‌పై విమర్శలు కురిపించడం ఇది మూడోసారి.

రతన్‌ టాటా ఒకానొక దశలో టిసిఎ్‌సను ఐబిఎంకు విక్రయించాలని జెఆర్‌డి టాటా ముందు ప్రతిపాదించారని తాజా లేఖలో మిసీ్త్ర వివరించారు. ఆ సమయంలో టిసిఎస్‌ హెడ్‌ కోహ్లీ హృదయ సమస్యలతో బాధపడుతున్నారని, ఈ కారణంగా రతన్‌ ప్రతిపాదనపై చర్చించేందుకు జెఆర్‌డి ఆ సమయంలో నిరాకరించారని వెల్లడించారు. తదనంతరం టిసిఎ్‌సకు మంచి భవిష్యత ఉంటుందని, దాన్ని అమ్మాలనుకోవడం మంచిది కాదని కోహ్లీ చెప్పడంతో రతన్‌ ప్రతిపాదనను పూర్తిగా జెఆర్‌డి నిరాకరించారని తెలిపారు.

రతన్‌ ప్రతిపాదన నిజమయి ఉంటే టీసీఎస్ కనిపించకుండా పోయేదన్నారు. టాటా, ఐబీఎం ఒక జెవిని 1992లో ప్రారంభించాయి, 1999లో ఈ జెవి విచ్ఛిన్నమయింది. 2004లో టిసిఎస్‌ పబ్లిక్‌ లిస్టింగ్‌కు వచ్చింది. రతన్‌పై ఆరోపణల గురించి వ్యాఖ్యానించేందుకు టిసిఎస్‌ నిరాకరించింది. అంతేకాదు బ్రిటన్‌కు చెందిన స్టీల్‌ సంస్థ కోర్‌సను భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేయడం రతన్‌ తీసుకున్న మరో అవివేక నిర్ణయమని మిస్త్రీ విమర్శించారు. రతన్‌ ఇగో కారణంగానే పలువురు బోర్డు సభ్యులు, సీనియర్‌ ఉద్యోగుల మాటను కాదని కోర్‌సను రెట్టింపు ధర పెట్టి 1200 కోట్ల డాలర్లకు కొనడం జరిగిందన్నారు. దీంతో కోర్‌సలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు వీల్లేకుండా పోయిందని, చివరకు కంపెనీ నిర్లక్ష్యానికి గురైందని, అంతిమంగా వేలాది మంది ఉద్యోగాలు ఊడేందుకు రతన్‌ నిర్ణయం దోహదం చేసిందని దుయ్యబట్టారు.

టెలికాం వ్యాపారంలో కూడా రతన్‌ ఒంటెద్దు పోకడలు పోయాడని, తత్ఫలితంగా అన్ని కంపెనీలు జిఎ్‌సఎం వైపు పరుగులు తీస్తుంటే టాటా మాత్రం సిడిఎంఎను అట్టిపెట్టుకొని కూర్చొందని వివరించారు. ఒక్క మనిషి తప్పుడు నిర్ణయం వేలాది జీవితాలను ప్రభావితం చేస్తుందని గుర్తు చేశారు. గతంలో రాసిన ఉత్తరాల్లో కూడా మిసీ్త్ర తనను తాను సమర్ధించుకుంటూ రతన్‌పై విమర్శలు గుప్పించడానికి ప్రాధాన్యమిచ్చిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ratan Tata  Cyrus Mistry  TCS  IBM  

Other Articles