మంత్రిగారా.. మజాకా.. మూసిన బ్యాంకును తెరిపించి.. bank reopens at odd hours for cabinet minister Iqbal Mehmood

Despite being closed bank reopens at odd hours for cabinet minister iqbal mehmood

banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, HDFC bank, Uttar Pradesh, VIP treatment, Cabinet Minister, Iqbal Mehmood, Sambhal district, demonetisation, common man is suffering. banks, bank managment, Arun jaitley, cm kcr, DEA, Secretary Shaktikanta Das, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

HDFC bank in Uttar Pradesh gave a VIP treatment to Cabinet Minister Iqbal Mehmood. The bank situated in Sambhal district reopened for the minister.

మంత్రిగారా.. మజాకా.. వీఐపి ట్రీట్మెంట్ ఇచ్చిన బ్యాంకు అధికారులు..

Posted: 11/18/2016 09:54 AM IST
Despite being closed bank reopens at odd hours for cabinet minister iqbal mehmood

న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్ట‌ే చర్యల్లో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో గత పది రోజులు గడుస్తున్న ప్రజలు బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా చలి, ఎండ అన్న పట్టించుకోకుండా తమ గంటల తరబడి బ్యాంకులు, ఏటీయం వద్ద క్యూ కడుతున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని హెచ్ డి ఎఫ్ సీ బ్యాంకు అధికారుల మాత్రం ఓ మంత్రి గారికి వీఐపి ట్రీట్ మెంట్ కల్పించడంతో పాటు ఆయన ముందు క్యూ లైన్లను కూడా బాలాదూర్ అనిపించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటున్న కొందరు రాజకీయ నాయకులు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల్చొని ఉన్న ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లి వారిని పరామ‌ర్శిస్తుండ‌డం చూస్తున్నాం. ఇటీవల కాంగ్రెస్ యువనేత కూడా మహారాష్ట్రలోని బీవండీ కోర్టుకు హాజరైన తరువాత ఆయన వస్తూ వస్తూ దారిలోని ఓ బ్యాంకు వద్ద క్యూ కట్టిన ప్రజలను పరామర్శించారు. కేంద్ర నిర్ణయం ప్రజల పాలిట శాపంలా పరిణమించిందని, ఈ క్యూలైన్లో నిల్చున్న వారిలో ఎవరైనా నల్లధనకుబేరుడు వున్నారా అని అయన ప్రశ్నించారు.

అలాగే, ఉత్త‌ర ప్ర‌దేశ్‌కి చెందిన ఓ మంత్రి ఈ రోజు బ్యాంకుకు వెళ్లారు. అయితే, ఖాతాదారుల‌ను ప‌రామ‌ర్శించ‌డానికి కాదు. తన వెంట త‌న‌ కుటుంబీకులు, స్నేహితులను తీసుకెళ్లిన స‌ద‌రు మంత్రిగారు బ్యాంకులో డ‌బ్బు డిపాజిట్ చేసుకున్నారు. డ‌బ్బు జ‌మ చేసుకోవ‌డంలో తప్పేమీ లేదు.. అయితే, ఆ మంత్రి బ్యాంకు వ‌ద్ద ప్ర‌వ‌ర్తించిన తీరు ప్ర‌జ‌ల‌కి కోపం తెప్పించింది. ఉత్త‌రప్ర‌దేశ్‌లో ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖ మంత్రిగా ప‌నిచేస్తోన్న ఇక్బాల్‌ మెహమూద్ త‌న‌ వారందరితో క‌లిసి సంభాల్‌ ప్రాంతంలోని ఓ బ్యాంక్‌కు వెళ్లారు.

అక్కడ క్యూలో నిల‌బ‌డిన ప్ర‌జ‌ల అంద‌రి క‌న్నా ముందుగా బ్యాంకులోకి వెళ్లిపోయారు. ఉదయాన్నే బ్యాంకుకు చేరుకొని ఎన్నో గంట‌ల నుంచి వేచిచూస్తోన్న ప్రజల గురించి ఆలోచించ‌ని బ్యాంకు సిబ్బంది, మంత్రి బ్యాంకుకు చేరుకోగానే మాత్రం వెంట‌నే బ్యాంకు గేట్లు తెర‌చి స్వాగ‌తం ప‌లికారు. ఆ వెంట‌నే ఆగమేఘాలపై ఆయన పనిని పూర్తి చేసేశారు. ఆ డ‌బ్బు తీసుకొని అక్క‌డితో ఆగ‌ని మంత్రి దురుసుగా మాట్లాడారు. వెళుతూ వెళుతూ.. తానో మంత్రినని, క్యూలో నిలబడాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించారు. దీంతో క్యూలో నిలబడిన ప్ర‌జ‌లు బ్యాంక్‌ సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles