ప్రాణాలు పోతున్న మోదీ మౌనం ఎందుకు? | Modi silent on queue deaths in Parliament.

Why modi silent on demonstration in parliament

PM Narendra Modi, Narendra Modi, Demonstration, Modi Must Speak On Notes Ban, Notes Ban, Parliament Notes Ban

PM Narendra Modi Must Speak On Rs 500 And 1000 Notes Ban In Parliament.

క్యూ చావులు మోదీ కంటపడటం లేదా?

Posted: 11/17/2016 12:12 PM IST
Why modi silent on demonstration in parliament

పెద్ద నోట్ల రద్దు అంశం గురువారం చట్టసభ ఉభయసభలనూ కుదిపేస్తోంది. పెద్దల సభ(రాజ్యసభ) ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. మరోవైపు లోక్ సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూల్లో నిలబడి మనుషులు మరణిస్తున్నా నరేంద్ర మోదీ సర్కారు మొద్దు నిద్రపోతోందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ తదితర విపక్ష పార్టీల ఎంపీలు పోడియంలోకి ప్రవేశించి ప్రభుత్వ వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు.

సభలో ప్రధాని లేకపోవటంతో వారు మండిపడుతున్నారు. ప్రజలు ప‌డుతున్న‌ ఇబ్బందుల‌పై ఆయన వచ్చి స‌మాధానం చెప్పాల్సిందేన‌ని ప‌ట్టువ‌దల‌డం లేదు. అయితే సభ్యులు శాంతించాలని చర్చకు ప్రభుత్వం సిద్ధమని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎన్నిమార్లు ప్రకటించినా, విపక్ష సభ్యులు వినటంలేదు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

మోదీ సర్కారును ఎండగడుతూ, చర్చకు పట్టుబడుతుండగా, నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను సాగిస్తున్నారు. లోక్ సభలో ప్రధాని మోదీ కనిపించక పోవడాన్ని విపక్షాలు తప్పుబడుతూ, ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పే తీరాలని డిమాండ్ చేస్తున్నారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గేకు సుమిత్రా మహాజన్ అవకాశం ఇవ్వగా, ఆయన ప్రసంగిస్తూ, దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయారని, ఒక ఇంట్లోని ఎవరో ఒకరు రోజంతా తమ పనిని వదులుకొని బ్యాంకుల ముందు నిలబడాల్సిన పరిస్థితిని మోదీ కల్పించారని విమర్శించారు. తక్షణమే పరిస్థితిని చక్కబెట్టాలని, లేకుంటే రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని ప్రకటించి జాతికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Notes Ban  Parliament  Narendra Modi  Demonstration  Parliament  

Other Articles