pawan kalyan goes to bank to exchange ban notes జనంలో ఒక్కడిగా వచ్చి నోట్లు మార్చుకున్న జనసేన అధినేత

Pawan kalyan goes to bank to exchange ban notes

pawan kalyan, janasena, jubilee hills bank, Currency exchange, demonetisation, RBI, parliament session, congress, pm modi, demonetisation, demonetisation rules, rbi demonetisation, atm demonetisation, atm withdrawal charges, india news

Tollywood power star and janasena cheif actor and politician pawan kalyan goes to bank to exchange ban notes

జనంలో ఒక్కడిగా వచ్చి నోట్లు మార్చుకున్న జనసేన అధినేత

Posted: 11/16/2016 05:55 PM IST
Pawan kalyan goes to bank to exchange ban notes

అవినీతి, నల్లధనంపై పోరులో భాగంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అటు బీజేపి నేతలు, ఇటు విపక్షాలు చేస్తున్న వాదనలు పూర్తిభిన్నంగా వున్నా.. ప్రజలు మాత్రం ఈ నిర్ణయం వెలువడిన 8వ తేది రాత్రి నుంచి బ్యాంకులు, ఏటీయం కేంద్రాల వద్ద బారులు తీరుతున్న వైనాన్ని చూస్తూనే వున్నాం. ఈ నోట్ల మార్పిడి కోసం బారులు తీరిన క్యూ లైన్లలో నిలబడి అసువులు బాస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించాలా..? లేదా.. అన్న విషయాన్ని పక్కన బెడితే వేళ్ల మీద లెక్కబెట్టే శాతంలో వున్న నల్లకుబేరులెవరూ ఇప్పటి వరకు బ్యాంకుల ముందుకు మాత్రం రాలేదన్నది వాస్తవం. వారిని అరికట్టే నేపథ్యంలో సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదన్నది కూడా అంగీకరించక తప్పని నిజం. డబ్బున్న మారాజులు ఏన్ని వివరణలు ఇచ్చినా.. పనులు మానుకుని అటు జీతం పోయి.. ఇటు బారులు తీరిన క్యూ లైన్లో వేచి తమ వంతు వచ్చే వరకు డబ్బు వస్తుందో లేదో తెలియక ఇబ్బందులు పడుతున్న వారి కష్టాన్ని ఎవరు భర్తీ చేయలేరన్నది వాస్తవం.

అయితే ఈ నోట్ల మార్పిడి కోసం సామాన్యులే కాదు, నిజాయితీ వున్న పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా బ్యాంకులకు వస్తున్నారు. ఈ జాబితాలో జనసేన అధినేత, ప్రముఖ సినీ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఓ బ్యాంకుకు స్వయంగా వచ్చారు. అయితే సెలబ్రిటీ కావడం.. ఆయన క్యూ లైన్ లో నిలబడితే.. తమకే ఇబ్బందని భావించిన బ్యాంకు అధికారులు ఆయనను నేరుగా బ్యాంకులోకి అనుమతించారు.

దీంతో ఆయన తన వద్ద ఉన్న పెద్ద నోట్లను అధికారులకు ఇవ్వగా, వాటిని అధికారులు పరిశీలించి ఆయన అకౌంట్ లో జమచేశారు. అయితే చక్కు రూపంలో ఆయన కొంత ( 25 వేల రూపాయలు) నగదును కూడా తమతో తీసుకెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించి పవన్ బ్యాంకులో కూర్చున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరోవైపు, బ్యాంకు వద్దకు పవర్ స్టార్ వచ్చారన్న విషయం చుట్టుపక్కల పొక్కడంతో, ఒక్కసారిగా అక్కడకు చేరుకున్న అభిమానుల తాకిడితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఇంతలో పవన్ కల్యాన్ తన పని ముగించుకుని వెళ్లిపోయారని తెలిసి అభిమానులు నిట్టూర్పవదిల్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  jubilee hills bank  Currency exchange  demonetisation  RBI  

Other Articles