మంత్రి చూసిన బూతు బోమ్మలు అమెరికా ఫస్ట్ (హాట్) లేడీవేనా..? Trump's wife Melania on Karnataka minister's mobile?

Trump s wife melania on karnataka minister s mobile

Tipu Jayanti, Tanveer Sait, Melania Trump, Melania Knauss, Donald Trump, US President-elect, mobile Phone, porngate, Karnataka minister Tanveer Sait, third wife of donald card, Tipu Jayanti event ruckus

Karnataka minister Tanveer Sait was reportedly surfing revealing photographs of Melania, a former model and the third wife of US President-elect Donald Trump, on his cellphone.

మంత్రి చూసిన బూతు.. అమెరికా ఫస్ట్ (హాట్) లేడీవేనా..?

Posted: 11/16/2016 12:20 PM IST
Trump s wife melania on karnataka minister s mobile

తన గెలుపుతో అటు అగ్రరాజ్యం అమెరికా వాసులతో పాటు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన వ్యక్తి డోనాల్డ్ ట్రంప్. అయితే ఆయనతో పాటు అయన సతీమణి మెలానియా కూడా ఎన్నికల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. మన దర్శకుడు రాం గోపాల్ వర్మ.. అమెరికాకు ఫస్ట్ లేడీగా హాట్ బ్యూటీ వచ్చిందని కూడా కామెంట్ చేశారు. ఆ స్థాయిలో ట్రంప్ సతీమణి మెలానియా ప్రచారాన్ని పొందారు.

అంతేకాదండోయ్.. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ మంత్రివర్యులు తన పదవిగండాన్ని ఎదుర్కోవడానికి కూడా మెలానియా కారణమని స్పష్టం అవుతుంది. అమెరికాకు, కర్ణాటక మంత్రికి సంబంధమేంటని అలోచిస్తున్నారా..? ఆ మధ్య మహారాష్ట్రలో ఆ తరువాత దేశంలోని పలు రాష్ట్రాలలో ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు కొందరు ఏకంగా చట్టసభల్లో, పార్టీ సమావేశాల్లో అసభ్యచిత్రాలను చూస్తూ పట్టుబడ్డారు. తాజాగా అలాంటి పనిచేసి కర్ణాటక పాథమిక, మాధ్యమిక విద్యాశాఖ మంత్రి  తన్వీర్‌ సేఠ్‌ కూడా అడ్డంగా దొరికిపోయారు. టిప్పు సుల్తాన్ జయంతోత్సవాల కార్యక్రమంలో ఉండగా మొబైల్‌ ఫోన్‌ లో బూతుబొమ్మలు చూస్తూ మంత్రి మీడియాకు చిక్కారు.

అయితే ఆయన అంత ఆసక్తిగా వీక్షించిన ఫొటోలు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌ సతీమణి మెలానియాకు చెందినవని వెల్లడైంది. మెలానియా మోడలింగ్‌ చేసినప్పటి ఫొటోలను చూస్తూ తన్వీర్‌ సేఠ్‌ కెమెరా కంటపడడంతో ఆయనపై విమర్శలు చెలరేగాయి. ట్రంప్‌ విజయం సాధించడంతో మెలానియా పాత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విరివిరిగా పోస్ట్‌ అవుతున్నాయి. ట్రంప్‌ ను​ పెళ్లాడకముందు మెలానియా మోడలింగ్‌ చేశారు. అయితే వీటినే మంత్రివర్యులు వీక్షించారని సమాచారం. ఈ మేరకు మంత్రి ఫోన్‌ లో మెలానియా ఫొటోలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tipu Jayanti  Tanveer Sait  Melania Trump  porngate  karnataka  

Other Articles