జేబులో డబ్బులున్నా.. బజార్లో ఏమీ దోరకదు..ఎందుకు..? New Rs 2000 note legal tender but not easy to get change for

New rs 2000 note legal tender but not easy to get change for

RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, Latest News, Breaking News, India News, Economy, Rs 2000 new note, nashik press, banks, Reserve bank of India, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

most are issuing only the new pink 2000 rupee notes or the old Rs 100 notes in exchange. Most banks are currently not giving out the new Rs 500 notes in exchange.

జేబులో డబ్బులున్నా.. బజార్లో ఏమీ దోరకదు..ఎందుకు..?

Posted: 11/13/2016 01:59 PM IST
New rs 2000 note legal tender but not easy to get change for

పాత 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి ఐదు రోజులు గడుస్తున్నా.. ప్రజల చేతుల్లో మాత్రం ఇంకా డబ్బులు అడటం లేదు. జేబుల్లో వున్న పాత నోట్లు చెల్లవు.. ఇక అందుబాటులోకి వచ్చిన కొత్త నోట్లకు చిల్లర దొరకవు.. దీంతో అంగట్లో అన్నీ వున్నా.. అల్లుడి నోట్లో.. అన్న చందంగా మారిపోయింది ప్రజల పరిస్థితి. ప్రధాని నిర్ణయంపై తొలుత సానుకూలంగా స్పందించిన ప్రజలు రోజులు గడుస్తున్న కొద్ది ఆయన నిర్ణయంపై విముఖతను వ్యక్తం చేస్తున్నారు.

తమ జేబుల్లో వున్న పాత నోట్లను మార్చుకోవాలంటే గంటల కొద్దీ బ్యాంకుల ముందు పడిగాపులు కాయాలి. ఎకౌంట్‌లోని డబ్బు డ్రా చేయాలన్నా ఇదే పరిస్థితి. ఇక ఏటీఎంల వద్ద పెద్ద క్యూలో నిల్చున్నా తమ వంతు వచ్చేసరికి అందులో డబ్బు ఉంటుందన్న నమ్మకం లేదు. ఇక చాలా ఏటీఎంలలో డబ్బులు లేవు. మరికొన్ని ఏటీయంలు ప్రధాని నిర్ణయం ప్రకటించిన తరువాతి రోజు నుంచి మూతబడే వున్నాయి. ఇన్ని కష్టాలు పడి కొత్త 2000 రూపాయల నోటు సంపాదిస్తే మరో సమస్య ఎదురవుతోంది.

కొత్త 2000 రూపాయల నోటును చాలా చోట్ల తీసుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. దీనికి చిల్లర నోట్లు అందుబాటులో లేకపోవడమే కారణమని చెబుతున్నారు. కొత్త 2 వేల నోటు తీసుకుని వెళితే చిల్లర లేదని వ్యాపారులు చెబుతున్నారని, ఏం చేయాలో పాలుపోవడం లేదని ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ వాసి చెప్పారు. రద్దయిన 500, 1000 రూపాయల నోట్ల స్థానంలో కొత్తగా 500, 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

కాగా 2 వేల రూపాయల నోటు అందుబాటులోకి రాగా, 500 రూపాయల నోట్లు ఇంకా రాలేదు. దీంతో 2 వేల రూపాయల నోటు మార్చేందుకు చిల్లర సమస్య ఏర్పడింది. ప్రస్తుతం ఎక్కువగా 100, 50 నోట్లే అందుబాటులో ఉన్నాయి. 2 వేల నోటుకు సరిపడా, లేదా కాస్త తక్కువగా సరుకులు తీసుకుంటే నోటు తీసుకుని చిల్లర వాపసు ఇస్తున్నారు. అదే తక్కువ మొత్తంలో కొనేందుకు వెళితే 2 వేల రూపాయల నోటును తీసుకోవడం లేదు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500. Rs 1000  Rs 2000 new note  Rs 2000 new note  nashik press  banks  Reserve bank of India  

Other Articles