ప్రజలు ప్రభుత్వాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు.. జాగ్రత్తా..! RBI receives first lot of 5 million new Rs 500 notes from Nashik press

Nashik press sends first lot of 5 million new rs 500 notes to rbi

RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, Latest News, Breaking News, India News, Economy, Rs 2000 new note, nashik press, banks, Reserve bank of India, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

In a breather for the citizens facing hardship after demonetisation announcement, the Currency Note Press (CNP), Nashik, has started dispatching new notes of Rs 500 denomination to the Reserve Bank of India

చెలామణిలోకి రానున్న కొత్త రూ.500 నోటు..

Posted: 11/13/2016 10:53 AM IST
Nashik press sends first lot of 5 million new rs 500 notes to rbi

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం వారి ఇబ్బందులను దూరం చేసేందుకు చర్యలు తీసుకుంది. కొత్తగా  రెండు వేల రూపాయల నోటును అందుబాటులోకి తీసుకువచ్చినా.. అంత పెద్ద మొత్తానికి చిల్లర ఇవ్వడాని తమ వద్ద లేకపోవడంతో.. దానిని వ్యాపారులు స్వీకరించేందుకు సిద్దంగా లేరు. దీంతో ప్రజలు చిల్లర కోసం అల్లాడుతున్న తరుణంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.

దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన 500 రూపాయల నోట్లు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండగా, కొత్త 500 రూపాయల నోటు ఇంకా చెలామణిలోకి రాలేదు. త్వరలో కొత్త 500 రూపాయల నోట్లను కూడా బ్యాంకులకు పంపనున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలో నాసిక్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌ (సీఎన్‌పీ)లో ముద‍్రించిన 50 లక్షల కొత్త 500 రూపాయల నోట్లు రిజర్వ్‌బ్యాంకు చేరుకున్నాయి.

రెండో విడతలో మరో 50 లక్షల 500 రూపాయల నోట్లను బుధవారం కల్లా ఆర్‌బీఐకు పంపుతామని సీఎన్‌పీ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ‍్యలో 20, 50, 100 రూపాయల నోట్లను ముద్రించారు. ఆర్‌బీఐ ఈ నోట్లను బ్యాంకుల పంపనుంది. ఈ నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కరెన్సీ సమస్య తీరుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 40 కోట్ల 500 రూపాయల నోట్లను ముద్రించాలని సీఎన్‌పీకి ఆదేశాలు వచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500. Rs 1000  Rs 2000 new note  Rs 2000 new note  nashik press  banks  Reserve bank of India  

Other Articles