చిల్లర కరువు తీర్చనున్న ‘ఏటీయం’లు ATMs to resolve the perennial problem

Atms to resolve the perennial problem

Rs 50, Rs500 Notes, Rs1000 Notes, Rs 2000 Notes, ATM, new 1000 notes, shaktikanta das, GPS nano chip, pakistan, isi, terrorists, black money, new currency, baba ramdev, PM Modi, surgical strike on black money, swachh currency, baba ramdev shocking relavations, Rs 10,000 currency note

RBI said all ATMs have to be re-configured to disburse bank notes of Rs. 100 and Rs. 50 denominations prior to reactivation of the machines on Nov 11th.

చిల్లర కరువు తీర్చనున్న ‘ఏటీయం’లు

Posted: 11/10/2016 01:45 PM IST
Atms to resolve the perennial problem

దేశంలోంచి అవినీతిని పారద్రోలేందుకు సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న కేంద్రంలోని మోడీ సర్కార్.. తమ నిర్ణయంతో ధరాఘాతం కూడా కిందకు దిగివస్తుందని బావిస్తుంది. దీంతో అన్ని ధరలు అదుపులోకి రావడంతో పాటు.. మళ్లీ చిన్న కరెన్సీ నోట్లు మళ్లీ తమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటాయని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని కూడా తీసుకుంది.

ఇప్పటికే కోత్తగా దేశ ప్రజల చేతుల్లో అలరారుతున్న రెండు వేల రూపాయల కరెన్సీనోటుతో పాటు మరికొన్ని రోజుల వ్యవధిలో ఐదు వందల రూపాయల నోటు కూడా అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరో రెండు మూడు నెలల వ్యవధిలో తాను మళ్లీ వస్తానని.. అదృశ్యమౌతున్నది కేవలం తాత్కాలికమేనని వెయ్యి రూపాయల నోటు కూడా చెబుతుంది. కొత్తగా రంగులద్దుకుని.. సరికొత్త డిజైన్ తో రెట్టింపు భద్రతా ప్రమాణాలతో అన్ని నోట్లు అందుబాటులోకి వస్తాయని కూడా తెలుస్తుంది.

అయితే ఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలందుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎం లలో కనిష్టంగా వచ్చేన 100 నోటు.. ఇక నుంచి మారనుంది. ఇకపై ఏటీయంలోలో అంతకన్నా తక్కువ విలువైన కరెన్సీ నోటు కూడా అందుబాటులోకి రానుంది. అంటే ఇప్పటి వరకు వున్న మల్టీపుల్ అఫ్ 100 విధానానికి ఏటీమంలు స్వస్తి పలికి.. ఇకపై మల్టిపుల్ అప్ 50 విధానానికి శ్రీకారం చుట్టనున్నాయి.

ఈ విధానం అందుబాటులోకి రావడంతో నవంబర్ 11 అనగా, రేపటి నుంచి అన్ని ఏటీఎం సెంటర్లలో 50 రూపాయల నోట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు అన్ని బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. ఒక్క రోజు పాటు నిలిపివేసిన సేవలతో అన్ని ఏటీయం కేంద్రాలలో ఈ మార్పులను చేయాలని అర్భీఐ బ్యాంకులకు అదేశాలను జారీ చేసింది. అయితే కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చిల్లర కరువు కష్టాలు గట్టెక్కినట్టేనని పలువురు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : currency notes  ATMs  RBI  Narendra Modi  demonetisation  currency denomination  economy  

Other Articles

Today on Telugu Wishesh