ప్రత్యేకహోదా సహా కరువు కాటు.. కరెన్సీ నోటుపై పవన్ ప్రసంగం Pawan to drum up support for AP Special Status

Pawan to drum up support for ap special status

Jana Sena Party, Pawan Kalyan, Special Category Status to Andhra Pradesh,​ AP special status, Andhra pradesh special status, Ap political news, JSP, TDP., BJP, power star pawan kalyan, PK janasena, janasena ananthapur

Jana Sena Party supremo Pawan Kalyan to drum up support for his relentless campaign for Andhra Pradesh Special Status along with surgical strikes and farmers suicide in anathapur.

ప్రత్యేకహోదా.. కరువు కాటు.. కరెన్సీ నోటుపై పవన్ ప్రసంగం

Posted: 11/10/2016 12:49 PM IST
Pawan to drum up support for ap special status

తన అభిమాని మృతితో పరామర్శకు వెళ్లి.. కలియుగ దైవం తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని.. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రత్యేక హోదా అవసరమని, అందుకోసం తాను అంచెల వారీగా ఉద్యమాన్ని చేపడతానని ప్రకటించిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అప్పుడే రాయలసీమలోకి ఎంటరై సభను కూడా నిర్వహించారు. అయితే మిని తెలుగురాష్ట్రంగా పరిగణింపబడిన తిరుపతి కాకుండా పక్కగా రాయలసీమ ప్రాంతమైన అనంతపురంలో తొలిసారిగా ఆయన సభను నిర్వహించనున్న నేపథ్యంలో దానిని సక్సెస్ చేయాలని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు యోచిస్తున్నారు.

కాకినాడలో నిర్వహించిన సభ తరువాత ఏర్పాటు చేస్తున్న సభ కావడం.. దీనికి తోడు మూడు వారాల ముందుగానే జనసేన అధినేత అనంతపురంలో సీమాంధ్రహక్కుల జనచైతన్య సభ నిర్వహించనున్నట్లు ప్రకటించడంతో.. అభిమానులు, పార్టీ కార్యకర్తుల, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతారన్న అంచానాలు నెలకోన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. పవన్ జనసేన ఏర్పాటు తరువాత తొలిసారిగా తమ ప్రాంతానికి వస్తున్న నేపథ్యంలో అభిమానులు కూడా భారీ అంచనాలతో వున్నారు.

పవన్ అంటే యువతలో ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో సభ గ్రాండ్ సక్సెస్ అవుతుందని, రాయలసీమ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారని అంచనా. తిరుపతి సభను కేవలం 36 గంటల వ్యవధిలోనే ప్రకటించినా.. అక్కడకు చేరకున్న యువత సంఖ్య చెప్పనవసరం లేదు. ఇక కాకినాడ సభ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. దీంతో అనంతసభ హాజరయ్యే వారి సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా. ఈ నేపథ్యంలో సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు పోలీసులతో పాటు ఇటు జనసేన వాలెంటీర్లు కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.  

ఈ క్రమంలో జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా సుమారు 1800 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో నిమగ్నమయ్యారు.మరోవైపు ప్రజలు పవన్ అభిమానులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సుమారు 600 మంది జనసేన వాలంటీర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం మహిళలకు ప్రత్యేక ఏర్పాటు కూడా చేశారు. వాహనాల్లో పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావచ్చన్న ఉద్దేశంతో ట్రాఫిక్ విషయంలో కూడా ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను ఏర్పాటు చేశారు.

అనంత సభావేదికపై పవన్ ప్రసంగం ఎలా వుండబోతుందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచుస్తున్నాయి. నిత్యం కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్న ఆయన.. ఈ సారి రెండు సర్జికల్ స్ట్రైక్స్ పై పవన్ వ్యాఖ్యానిస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వీటికి తోడు ఆనంతపురంలో కరువు కాటు వేసిందని అక్కడి రైతులు అప్పులఊభిలో చిక్కకుపోవడం అంశాన్ని కూడా పవన్ తన ప్రసంగంలో వినిపిస్తారని సమాచారం. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ తో ప్రజా గళాన్ని కేంద్రానికి వినిపిస్తారని జనసేన వర్గాలు సమాచారం.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్తంగా సభలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పార్టీ రానున్న ఎన్నికలలో కేంద్రంలోని బీజేపి పార్టీతో పొత్తు పెట్టుకోనూ అని తిరుపతి సభలోనే ఆయన స్పస్టత నిచ్చారు. ఈ క్రమంలో ప్రధాని తీసుకున్న రెండు కఠిన నిర్ణయాలను పవన్ కల్యాన్ తాను సాగిస్తున్న ఉద్యమానికి ఎలా అన్వయించుకుంటారని రాజకీయ వర్గాలు, విశ్లేషకులు వేచిచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  jana sena  anathapur  JSP  TDP  BJP  Congress  

Other Articles