‘‘నల్లధనం, నకిలీ నోట్లకు అడ్డుకట్ట ఈ నిర్ణయం’’ It's a setback to parallel black money economy says Arun Jaitley

It s a setback to parallel black money economy arun jaitley on scrapping rs 500 1000 notes

arun jaitely, scrapping notes, 500 notes, 1000 notes, economy, banks, rbi, reserve bank of india, india news, black money, corruption, surgical strike on black money

Finance Minister Arun Jaitley said the decision to scarp Rs 500 and Rs 1000 notes will be a setback to parallel black money economy

‘‘నల్లధనం, నకిలీ నోట్లకు అడ్డుకట్ట ఈ నిర్ణయం’’

Posted: 11/09/2016 08:05 PM IST
It s a setback to parallel black money economy arun jaitley on scrapping rs 500 1000 notes

నల్లధనానికి, న‌కిలీ నోట్లకు పెద్ద నోట్ల ర‌ద్దుకు తమ ప్రభుత్వ నిర్ణయం అడ్డుకట్ట వేస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. తాత్కాలికంగా ఒకటి, రెండు రోజుల ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. అయితే రెండు రోజుల త‌రువాత ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వని జైట్లీ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆర్థిక శాఖ అధికారుల‌తో క‌లిసి మీడియా సమావేశం ఏర్ప‌ర‌చి విలేక‌రులు అడిగిన ప్రశ్నల‌కు స‌మాధానాలు చెప్పారు. కేంద్ర నిర్ణయంతో ప‌న్నుల వ‌సూళ్లు పెరుగుతాయని చెప్పారు. వీలైనంత త్వ‌ర‌గా అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించ‌డానికి కృషి చేస్తామ‌ని అన్నారు.

దేశ ఆర్థిక వ్యవ‌స్థకు క‌లిగే న‌ష్టానికి, న‌ల్లధ‌నానికి చెక్ పెట్టడానికే ఈ చ‌ర్యలు తీసుకుంటున్నట్లు అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. న‌ల్లధ‌నం వ‌ల్ల ఆర్థిక వ్యవ‌స్థ ఛిన్నాభిన్నం అవుతుందని, అవినీతి నిరోధానికి కేంద్రం సంచ‌ల‌న నిర్ణయం తీసుకుందని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశ ఆర్థిక వ్యవ‌స్థ మరింత బ‌ల‌ప‌డుతుందని, ఆర్థిక సంస్కర‌ణ‌లకు కృషి చేస్తోన్న కేంద్రం నిర్ణయాల వ‌ల్ల పేద‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్తబోవ‌ని చెప్పారు. ప్రతిప‌క్షాలు దీనిపై కామెంట్ చేసే ముందు ఈ విష‌యాన్ని క్షుణ్ణంగా ప‌రిశీలించాల‌ని చెప్పారు.

1978 నాటి ప‌రిస్థితితో ఇప్ప‌టి ప‌రిస్థితిని పోల్చిచూడ‌కూడ‌ద‌ని, అప్పటి ఆర్థిక వ్యవ‌స్థ ఇప్పటి వ్యవ‌స్థకు తేడా ఉంద‌ని జైట్లీ చెప్పారు. కేంద్ర నిర్ణయం దేశంలోని అవినీతి ప‌రులకు మాత్రమే న‌ష్టమ‌ని స్పష్టం చేశారు. న‌ల్ల బినామీ లావాదేవీల‌ను అడ్డుకునేందుకే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ప‌ట్ల ఆందోళ‌న అవ‌స‌రం లేద‌ని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arun jaitely  scrapping notes  500 notes  1000 notes  Indian economy  black money  

Other Articles