వైట్ హౌజ్ పోరుకు మరికొద్ది గంటలే... | Hillary Clinton and Donald Trump Battle to the End

Hillary clinton and donald trump battle to the end

Hillary Clinton and Donald Trump Battle to the End, countdown to the polls began for America president Elections, countdown starts for US elections, US elections 2016, America elections 2016, Hillary vs Trump, US poll last moments, beautiful's ugly election

countdown to the polls began for America president Elections.

వైట్ హౌజ్ ఫైట్: కౌంట్ డౌన్ స్టార్ట్

Posted: 11/08/2016 09:05 AM IST
Hillary clinton and donald trump battle to the end

విమర్శలు-ప్రతి విమర్శలు ఎంతలా అంటే వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసి మరీ... ఇప్పటిదాకా హిల్లరీ వర్సెస్ క్లింటన్ డిబెట్లతో సాగిన ఉత్కంఠతకు మరికొన్ని గంటల్లోకి తెరపడనుంది. యావత్ ప్రపంచమంతా ‘బ్యూటీపుల్స్ అగ్లీ ఫైట్’ గా అభివర్ణిస్తున్న ఈ ఎన్నికల పోలింగ్‌ ఈరోజే జరగనుంది. భారత కాలమానం ప్రకారం నేటి సాయంత్రం పోలింగ్ ప్రారంభమవుతుంది. ఇక ఫలితాలు రేపు మధ్యాహ్నానికి ప్రకటించేస్తారు. అంటే అగ్రరాజ్యం కొత్త ప్రెసిడెంట్ ఎవరన్నది 24 గంటల్లో తేలిపోతుంది.

సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటల వరకు కొనసాగుతుంది. అయితే రాష్ట్రాల మధ్య కాలమానంలో తేడాల వల్ల పోలింగ్ సమయంలో రెండు మూడు గంటలు అటూ ఇటుగా ఉంటుంది. రేపు తెల్లవారుజాముకల్లా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తవుతాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఉదయం 5 గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అదే సమయంలో ఎన్నికలపై పలు సంస్థలు చేసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటిస్తారు.

మొత్తం 12 కోట్ల మంది అమెరికన్ ఓటర్లు డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే 3.7 కోట్ల మంది ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష పీఠం అధిష్టించాలంటే అభ్యర్థులు 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ప్రతిరాష్ట్రం నుంచి ఓటర్లు తమకు నచ్చిన ఎలక్టోరల్‌కు ఓటు వేస్తారు.

రమారమి రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి ఫలితం వెలువడుతుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఎలక్టోరల్ కాలేజీకి ఎన్నికైన అభ్యర్థులు దేశాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనవరి 2, 2017న విజేతను ప్రకటిస్తారు. ఎన్నికైన అధ్యక్షుడు జనవరి 20న బాధ్యతలు స్వీకరిస్తారు. అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్థులు ఇద్దరూ పోటాపోటీగా ప్రచారం నిర్వహించడంతో గెలుపుపై ఉత్కంఠ నెలకొంది. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ఆధిక్యం ఇద్దరి మధ్య దోబూచులాడడంతో చివరి వరకు ఎన్నికలు ఉత్కంఠగా మారాయి.

ఈమెయిల్ వివాదంలో ఎన్నికలకు ఒక్కరోజు ముందు హిల్లరీకి ఎఫ్‌బీఐ క్లీన్ చిట్ ఇవ్వడంతో కాస్త వెనకబడిన ఆమె మళ్లీ దూసుకెళ్లగా, కంపు వ్యాఖ్యలతో ట్రంప్ తెగ ఇబ్బందులు ఎదుర్కున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు. కాగా ఎన్నికల్లో హిల్లరీకి విజయం తథ్యమని సర్వేలు చెబుతున్నాయి. మొత్తం 538 ఓట్లలో హిల్లరీకి 292 ఓట్లు వస్తే, ట్రంప్‌కు 245 ఓట్లు వస్తాయని తెలుస్తోంది. హిల్లరీకి 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని, ట్రంప్నకు షాక్‌ తప్పదంటూ రాయిటర్స్/ఇప్సాస్ స్టేట్స్ ఆఫ్ ద నేషన్ నిర్వహించిన సర్వేలో తేలటంతో ఎక్కువ శాతం మొగ్గు ఆమెవైపే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US Presidential Elections 2016  Count Down starts  Hillary versus Trump  

Other Articles