భర్త పోయాక అఫైర్ కోసం ఒత్తిడి... వినలేదని ప్రతీకారం ఇలా తీర్చుకున్నాడు | man published pamphlets against woman

Man published pamphlets against woman

vulgar pamphlets against woman, man published vulgar pamphlets, Hyderabad Man published Pamphlets, Pamphlets in Nizampet, Pamphlets against widow

man published vulgar pamphlets against woman in Hyderabad Arrested.

నిజాంపేటలో అసభ్య కరపత్రాల కలకలం

Posted: 11/08/2016 08:10 AM IST
Man published pamphlets against woman

భర్త బ్రతికున్నంత కాలం ఆ మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండేది. తీరా అతడు చనిపోయాక తప్పని గ్రహించి బుధ్ది తెచ్చుకుని మంచి జీవిత గడపసాగింది. పొరుగింటి పుల్ల కూర మరిగిన ప్రేమికుడు ఊరుకుంటాడా? తనతో అఫైర్ కొనసాగించాల్సిందేనని పట్టుబట్టాడు. మహిళ అందుకు ఒప్పుకోలేదు. ఊరకుంటాడా? చెప్పండి.

వెంటనే ఓ చెత్త ఆలోచన వేశాడు. తాను ఒంటరిగా ఉన్నానని, ఎవరైనా తనతో గడపాలనుకుంటే ఈ చిరునామాలో సంప్రదించవచ్చంటూ మహిళను అభాసుపాలు చేసేలా కరపత్రాలు ముద్రించి పంచిపెట్టాడు. అడ్రస్, ఫోన్ నంబర్లతోసహా అందులో సమాచారం ఉంచటంతో ఆమెకు అసభ్యకర రీతిలో ఫోన్ కాల్స్ రావటంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు వ్యక్తిని ఖాకీలు కటకటాల వెనక్కి నెట్టారు.

నిజాంపేటలో నివాసముండే ఓ వివాహిత మరో వ్యక్తితో సన్నిహితంగా మెలిగేది. నాలుగు నెలల క్రితం ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె సన్నిహితంగా ఉండే వ్యక్తిని పట్టించుకోవడం మానేసింది. దీంతో ఆగ్రహంతో ఉన్న అతడు మహిళపై కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే అసభ్యకరంగా కరపత్రాలు ముద్రించి ఆమె నివసిస్తున్న ప్రాంతంలో పంచిపెట్టాడు. వీటిని చూసిన కొందరు మహిళకు విషయం తెలపడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు కరపత్రాలు పంచిన నిందితుడితోపాటు వాటిని ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్ యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పలువురు మహిళలు ట్రాప్ చేసి ఇదే విధంగా వేధించాడని అతనిపై ఆరోపణలు కూడా ఉన్నాయంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Pamphlets  Widow  Vulgar  Man  arrest  

Other Articles