హిల్లరీ, ఒబామాలపై విమర్శలను గుప్పించిన ట్రంప్ Obama campaigning full-time for Hillary, says Trump

Barack obama campaigning full time for hillary clinton says donald trump

us election 2016, trump vs clinton, hillary clinton-email scandal, poll tracking, clinton leads trump, poll, clinton democractic presidential nominee

In a sharp attack on Hillary Clinton, Republican presidential nominee Donald Trump has said US President Barack Obama is campaigning full-time for her as the Democratic nominee's rallies do not attract many people.

హిల్లరీ, ఒబామాలపై విమర్శలను గుప్పించిన ట్రంప్

Posted: 11/06/2016 01:09 PM IST
Barack obama campaigning full time for hillary clinton says donald trump

ఎన్నికలకు మరో మూడు రోజులే వున్న వేళ.. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మళ్లీ పైచేయి సాధించిన తరుణంలో..  అమెను ఢీకొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్న ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ అందివచ్చిన ప్రతీ అంశాన్ని రాజకీయంగా వినియోగించుకోవడంలో ముందున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విమర్శలు గుప్పించిన ట్రంప్.. తన పంథాను మార్చి ఏకంగా ఒబామాతొ పాటు హిల్లరీని కలపి విమర్శిస్తూ.. జనాకర్షక విమర్శలతో ఓటర్ల మైండ్ ను తన వైపుకు తిప్పుకుంటున్నారు.

ఇబామా తన పూర్తి సమయాన్ని హిల్లరీ క్లింటన్ ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నారని ఆయన తాజాగా విమర్శలు గుప్పించారు. హిల్లరీకి ఏమాత్రం జనాకర్షణ లేదని అందుకే ఆమె ఒబామా సహాయం తీసుకుంటున్నారని ఫ్లోరిడాలోని టంపాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ట్రంప్ ఎద్దేవా చేశారు. హిల్లరీ తనకోసం తాను ప్రచారం కూడా నిర్వహించుకోలేకపోతున్నారని.. ఆమె సొంతంగా నిర్వహించే ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో కేవలం 400 నుంచి 500 మంది ప్రజలు మాత్రమే పాల్గొంటున్నారని అన్నారు. అందుకే ఆమె ఒబామాపై ఆధారపడుతున్నారని ట్రంప్ విమర్శించారు.

చివరి దశ ప్రచారపర్వంలో హిల్లరీకి మద్దతుగా కీలకమైన ఫ్లోరిడా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియా, న్యూ హాంప్‌షైర్ రాష్ట్రాల్లో ఒబామా ఉధృతంగా పర్యటిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఈ విమర్శలు చేశారు. మీడియా వ్యవహరిస్తున్న తీరుపట్ల కూడా ట్రంప్ విమర్శలు గుప్పించారు. తన ప్రచారకార్యక్రమాలకు జనం తక్కువగా కనిపిస్తే మీడియా సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా హెడ్‌లైన్‌లలో వార్తలు ప్రచురిస్తాయని.. అదే హిల్లరీ విషయంలో మాత్రం అలా జరగటం లేదని ట్రంప్ అన్నారు.

ట్రంప్ ర్యాలీలో తుపాకీ కలకలం

డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కలకలం రేగింది. నెవెడ రాష్ట్రం రెనోలో ట్రంప్ ర్యాలీలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడే అవకాశం ఉందని అంచనా వేసిన భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ట్రంప్‌కు రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ను స్టేజి మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటనతో ప్రచార కార్యక్రమంలో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఓ అనుమానితుడిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది నిమిషాల అనంతరం ట్రంప్ ఎప్పటిలాగే తనదైన శైలిలో ఉత్సాహంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది అద్భుతంగా స్పందించారంటూ ట్రంప్ కితాబిచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us election 2016  trump vs clinton  hillary clinton  barrack obama  poll tracking  

Other Articles