తాజా సర్వేలో మళ్లీ పైచేయి సాధించిన హిల్లరీ.. Hillary leads Trump by two-point margin in latest survey

Hillary leads trump by two point margin in latest survey

us election 2016, trump vs clinton, hillary clinton-email scandal, poll tracking, clinton leads trump, poll, clinton democractic presidential nominee

This is a significant jump from latest tracking poll when Clinton's lead again by two-point margin in latest survey

తాజా సర్వేలో మళ్లీ పైచేయి సాధించిన హిల్లరీ..

Posted: 11/05/2016 04:48 PM IST
Hillary leads trump by two point margin in latest survey

ఎన్నికలకు మరో మూడు రోజులే వున్న వేళ.. అమెరికా అధ్యక్ష బరిలో నిలిచిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ మళ్లీ పైచేయి సాధించారు. తన ప్రత్యర్థిక రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన అధిక్యాన్ని కనబర్చింది. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేలు అభ్యర్థిలిద్దరి తో దోబుచులాడుతున్నట్లు వుంది. ఇక పరిస్థితి ఇలానే వుంటే అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారన్న విషయంలో నెలకొన్న ఉత్కంఠ మరింతగా పెరిగిపోతుంది.

ఒక సర్వేలో హిల్లరి అదిక్యం కనబర్చినా.. మరో సర్వేలో ట్రంప్ ఆ తరువాత తాజాగా నిర్వహించిన సర్వేలో హిల్లరీ ఆధిక్యంలోకి వచ్చేశారు. ఫాక్స్ న్యూస్ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ 2 శాతం పాయింట్ల ముందంజలో ఉన్నట్లు తేలింది. ఈ సర్వేలో క్లింటన్‌కు 45 శాతం మద్దతు లభించగా, ట్రంప్‌కు 43 శాతమే వచ్చింది. మరో ఐదు శాతం మంది గేరీ జాన్సన్‌కు, 2 శాతం మంది గ్రీన్ పార్టీకి చెందిన జిల్ స్టీన్‌కు మద్దతు పలికారు.
 
ట్రంప్‌కు మద్దతు పలికినవారిలో పురుషులు (+11 పాయింట్లు), తెల్లవారు (+19), కాలేజి డిగ్రీ లేని తెల్లవారు (+33) ఉన్నారు. ఇక హిల్లరీకి అండగా ఉన్నవారిలో మహిళలు (+13), ఆఫ్రికన్-అమెరికన్లు (+74), 30 ఏళ్లలోపువారు (+17) ఉన్నారు. ఇప్పటికే ఒకసారి ఓటు వేసినవారిలో కూడా 11 పాయింట్ల ఆధిక్యం హిల్లరీకే వచ్చింది. డిగ్రీ ఉన్న తెల్లవారిలో 45 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలకగా, హిల్లీరిక 42 శాతం మందే మద్దతుగా ఉన్నారు.  1211 మందిని లాండ్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారా ఇంటర్వ్యూ చేసి ఈ సర్వే ఫలితాలు రాబట్టారు. వారిలో 1107 మంది లైక్లీ ఓటర్లున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us election 2016  trump vs clinton  hillary clinton-email scandal  poll tracking  

Other Articles