అమ్మా బయిలెలుతున్నదో..! అమ్మ తల్లీ బైలెలుతున్నదో..!! Jayalalithaa to be moved from CCU to private room

Jayalalithaa to be moved from ccu to private room

jayalalithaa, jayalalithaa health, aiadmk, aiadmk jayalalithaa, jayalalithaa news, chennai apollo hospital, Aims doctors team, UK doctor, tamil nadu, latest news

CM Jayalalithaa will soon be moved out of the CCU to a private room, She has passed the critical stage, AIADMK leader said.

అమ్మా బయిలెలుతున్నదో..! అమ్మ తల్లీ బైలెలుతున్నదో..!!

Posted: 11/04/2016 12:15 PM IST
Jayalalithaa to be moved from ccu to private room

ఇది నిజంగానే తమిళనాడు ప్రజలకు శుభవార్త. దీపావళికి ముందే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారని, అమె త్వరలోనే పాలనను కూడా అందిస్తారన్న వార్తలతో గత నాలుగు రోజులుగా ఎంతగానో ఎదురుచూస్తున్న అన్నాడిఎంకే పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు శుభవార్తనందించాయి పార్టీ వర్గాలు. అమ్మను త్వరలోనే సీసీయూ (క్రిటికల్ కేర్ యూనిట్) నుంచి బయటకు తెచ్చి ప్రత్యేక గదికి మార్చనున్నారని ఆ పార్టీ సీనియర్ నేత పొన్నియన్ వ్యాఖ్యానించారు.

సెప్టెంబర్ 22 నుంచి ఊపిరితిత్తులలో సమస్యతో పాటు శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలోచికిత్స పొందుతున్న సీఎం జయలలితకు ఇన్ ఫెక్షన్ అదుపులోకి వచ్చిందని, వెంటిలేటర్ అవసరం లేకుండా శ్వాసను కూడా అమె స్వయంగా పీల్చుకుంటూ ఉండటంతో ఆమెను గదిలోకి మారుస్తున్నారని ఆయన తెలిపారు. ఇప్పుడామె అందరితోనూ మాట్లాడుతున్నారని కూడా చెప్పారు.

జయలలితకు ప్రస్తుతం విశ్రాంతి అవసరమున్న తరునంలో అమెను ప్రత్యేక గదికి తరలించి వైద్యులు పర్యవేక్షిస్తారని చెప్పారు. గత వారం రోజులుగా పురచ్చితలైవి ఘన ఆహారాన్ని తీసుకుంటున్నారని వివరించారు. ఆమెను ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలన్నది వైద్యుల నిర్ణయంపై ఆధారపడి వుంటుందని, ఆమె ఆరోగ్యం మెరుగు పడినందున మిగిలిన చిన్న సమస్యలను ఇంట్లో ఉంచి కూడా నయం చేసే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడం వెనుక డాక్టర్ల కృషి ఎంతో ఉందని తెలిపారు.

జయలలిత కోలుకుంటున్నారు:  ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి

త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత పూర్తిగా కోలుకున్నార‌ని అపోలో హాస్ప‌ట‌ల్ చైర్మన్ ప్ర‌తాప్ రెడ్డి తెలిపారు. చెన్నైలో జరిగిన పుస్తకావిష్కర‌ణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్లడించారు. జ‌య పూర్తిగా స్పృహ‌లోకి వ‌చ్చార‌ని, త‌న చుట్టు జ‌రుగుతున్న విష‌యాలు ఆమె గ్రహించ‌గ‌లుతున్నారని ఆయ‌న చెప్పారు. త‌న‌కు కావాల్సిన వాటిని ఆమె అడుగుతున్నార‌ని ప్రతాప్ రెడ్డి తెలిపారు. పూర్తిగా కోలుకున్న జ‌య‌ల‌లిత‌ను త్వర‌లోనే క్రిటిక‌ల్ కేర్ యూనిట్ నుంచి త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి. అమెకు కొంతకాలం పాటు విశ్రాంతి అవసరమన్న అయన అస్పపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలన్నది అమె నిర్ణయానికే వదిలేస్తున్నామని ప్రతాప్ రెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  Tamil Nadu Chief Minister  aiadmk  jayalalithaa health  tamil nadu  

Other Articles