తొమ్మిదేళ్ల కవలలపై తండ్రీ కోడుకుల దారుణం 9-year-old twin sisters raped by neighbour, minor son

9 year old twin sisters raped by neighbour minor son

rape, sexual assault, minor, Prevention of Children from Sexual Offences Act, minor, sexual assult on minors

One Jaffar and his 16-year-old son, who are neighbours of the minor girls, allegedly raped them repeatedly over the past one year.

తొమ్మిదేళ్ల కవలలపై తండ్రీ కోడుకుల దారుణం

Posted: 11/04/2016 11:52 AM IST
9 year old twin sisters raped by neighbour minor son

హైదరాబాద్ మహానగరంలో దారుణం జరిగింది. పిల్లాడు తప్పుచేస్తే సరిదిద్దాల్సిన తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి పదహారేళ్ల కొడుకుతో కలసి ముక్కుపచ్చలారని తొమ్మదేళ్ల చిన్నారులపై దారుణానికి ఒడిగ్టటారు. సభ్యసమాజం తలదించుకునేలా.. అసలు మనిషన్నవాడు ఎవ్వడూ పాల్పడని దురాగతానికి వీరు ఒడిగట్టారు. జంతువులకు, దారుణినికి పాల్పడిన నిందితలుకలు తేడా లేదని, వీళ్లు మానవ మృగాలేనని చాటిచెప్పారు. పొరుగింట్లో ఉంటున్న చిన్నారులను మరింత అప్యాయంగా, తమ పిల్లల మాదిరిగా చూసుకునే సభ్యత, సంస్కారాన్ని మరచి వారిపై ఏకంగా.. ఏడాది కాలంగా అత్యాచారానికి తండ్రీ కోడుకులు పాల్పడుతున్నారు.

తమపై జరుగుతున్న దురాగతాన్ని ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో కూడా తెలియని చిన్నారులు ఏడాది కాలంగా తమలో తామే బాధను దిగమింగుకుంటున్నారు. కాగా, మొదట్లో తమపై జరుగుతన్న లైంగికదాడిపై కుటుంబసభ్యడోకరికి వారు చెప్పినా.. అయన నిందితులకే మద్దతు పలికాడని కూడా పోలీసులు దర్యాప్తులో చిన్నారుతు రోదిస్తూ తెలిపారు. తాము ఈ భాధను భరించలేమని చిన్నారులు ధైర్యం చేసి బాలబాలికల హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఓ స్వచ్చంధ సంస్థ సభ్యుడికి విషయాన్ని చెప్పడం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ నగర శివార్లలోని మైలార్ దేవపల్లికి నేపాల్ కు చెందిన ఓ కుటుంబం వలస వచ్చి ఉంటోంది. వారికి మైనర్ కవల సోదరీమణులున్నారు. పొరుగింట్లో నివాసం ఉంటున్న జాఫర్ తన 16 ఏళ్ల మైనర్ కొడుకుతో కలిసి ఆ కవల సోదరీమణులపై ఏడాది కాలంగా పలుమార్లు అత్యాచారం జరిపారు. ఓ స్వచ్ఛందసంస్థ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధిత బాలికల ఫిర్యాదు చేయడంతో అత్యాచార నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  minor  Children  Sexual  

Other Articles