భారీ విస్పోటనం నుంచి జవాన్లను రక్షించిన శునకం CRPF sniffer dog saves many lives from blast

Crpf sniffer dog saves many lives from blast

Axel, trained sniffer dog, Shambhu Prasad, anti-bomb disposal squad, Central Reserve Police Force, Maoists, Hatamuniguda, Rayagada-Muniguda road, Rayagada district, Bhubaneswar, odisha

Axel, a specially trained sniffer dog engaged in the anti-bomb disposal squad of the Central Reserve Police Force saved many lives as he successfully detected an improvised explosive device (IED)

భారీ విస్పోటనం నుంచి జవాన్లను రక్షించిన ‘అక్సెల్’

Posted: 11/04/2016 12:07 PM IST
Crpf sniffer dog saves many lives from blast

ఆక్సెల్ లేకపోతే.. ఇవాళ మనం ఓ విషాదకర వార్తను చదివేవాళ్లం. నిజమే.. ఇంతకీ అక్సెల్ అంటే ఏంటనుకుంటున్నారు. శునకం. అయితే అన్ని శునకాలకు మాదిరిగా దీనికి విశ్వాసం పాలు ఎక్కువే. దీనికి తోడు విశ్వాసంతో పాటు తనకు అప్పగించిన బాధ్యతను కూడా క్రమం తప్పకుండా నిర్వహించి సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను రక్షించింది. నమ్మశక్యంగా లేదా.? ఇది సాధారణ శునకం కాదు.. సీఆర్ఫీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్న శునకం. అంటే కఠోర శిక్షణ పోంది.. భూమి లోపల అమర్చిన బాంబులను ఇట్టే గుర్తించడంలో ఇది దిట్ట.

సాధారణంగా పోలీసు కుక్కలు అంటే వాసన చూసి నేరస్థులను, వారు ఎక్కడెక్కడ సంచరించారన్న వివరాలను పసిగడతాయి. అయితే సీఆర్పీఎఫ్‌లో శిక్షణ పొందిన అక్సెల్ అనే శునకం బాంబులను, ఐఈడీలను, ల్యాండ్ మైన్లను గుర్తించడంలో నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఏవోబీలో మావోయిస్టులను హతమర్చినందుకు నిరసనగా ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గత రెండు రోజులుగా ఏఓబి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

ఈ క్రమంలో భూమిలో అమర్చిన అత్యంత శక్తిమంతమైన ఐదు కేజీల ఐఈడీని గుర్తించిన అక్సెల్ ఎందోమంది జవాన్ల ప్రాణాలను కాపాడింది. ఒడిసాలోని రాయగడ జిల్లాలోని రాయిగడ- మునిగుడ రోడ్డుపై హతమునిగూడ వద్ద మావోయిస్టులు ఐఈడీని అమర్చారు. దాన్ని ఆక్సెల్ అనే సీఆర్పీఎఫ్ స్నిప్పర్ డాగ్ అక్సెల్ గుర్తించింది. అయితే, దాన్ని గుర్తించే సమయంలో దాని కాలికి, కంటి కింద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన యాంటీ బాంబ్ స్వాడ్ బాంబును నిర్వీర్యం చేశారు.
 
ఏడేళ్ల వయసున్న ఆక్సెల్.. గత నాలుగేళ్ల నుంచి సీఆర్పీఎఫ్‌కు సేవలు అందిస్తోంది. శంభు ప్రసాద్ అనే ట్రైనర్ దాని బాధ్యతలు చూస్తున్నారు. ఆయన శిక్షణలోనే అక్సల్ బాంబులను గుర్తించగలుదుతుందని పోలీసులు చెప్పారు. మావోల బంద్ రోజున అక్సెల్ దానిని గుర్తించని పక్షంలో జవాన్ల ప్రాణనష్టం అనివార్యమైయ్యేదని అధికారులు అన్నారు. ఈ ఐఈడీని గనక మావోయిస్టులు పేల్చి ఉంటే.. అటువైపుగా కూంబింగ్ కోసం వెళ్లే సీఆర్పీఎఫ్ బలగాలకు చాలా పెద్దమొత్తంలోనే ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  crpf sniffer dog  ied planted  Maoists  anti naxal squad  Bhubaneswar  odisha  

Other Articles

Today on Telugu Wishesh