కేంద్ర మంత్రి కిరణ్ రిజ్జూకి ఓ యువతి పంపిన వీడియో సందశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశ రాజధానిలో తనకు, తన స్నేహితురాళ్లకు జరిగిన ఘోర అవమానం గురించి అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఆ యువతి అందులో పేర్కొంది. ప్రముఖ జమా మసీదు సెక్యూరిటీ సిబ్బంది తమతో ప్రవర్తించిన తీరును యువతి ఆవేదనతో వ్యక్తం చేసింది.
నియాంగ్ పెట్రిన్ అనే అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువతి ఢిల్లీ యూనివర్సిటీ లా విద్యార్థి. కొన్ని రోజుల క్రితం నియాంగ్ ఊరి నుంచి వచ్చిన తన స్నేహితులతో కలిసి ఇటీవల ఢిల్లీలోని జామా మసీదును సందర్శించింది. ఈ సందర్భంగా గేట్ నంబర్ 8 వద్ద ఫోన్ మాట్లాడుతున్న తమ వద్దకు సిబ్బంది వచ్చారంట. ఫోన్ మాట్లాడటం నేరం అంటూ 300 చెల్లించాల్సిందేనని బెదిరించారంట.. ఇతరులు అందరూ సెల్‌ఫోన్లు తీసుకెళ్తున్నా, విచ్చల విడిగా మాట్లాడుతున్న తమను మాత్రమే ఎందుకు అడ్డుకున్నారంటూ వారు ప్రశ్నిస్తే.. అసలు మీరు భారతీయులేనా, ఐడెంటీ కార్డులు చూపించాలంటూ గొడవకు దిగారని ఆవేదన వ్యక్తం చేసింది.
Despite Home Ministry taking various steps to stop discriminations against the North-East people this still happened! I will follow it up. pic.twitter.com/0RASlw797T
— Kiren Rijiju (@KirenRijiju) November 1, 2016
ఈశాన్య ప్రాంతానికి చెందిన తాను ప్రతిసారీ తన జాతీయతను నిరూపించుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. మ్యూజియం, పార్క్.. ఇలా బయటకు ఎక్కడికి వెళ్లినా గుర్తింపు కార్డు అడుగుతున్నారని పేర్కొంది. తాను విదేశీయురాలని కాదని, అచ్చమైన భారతీయురాలినని పేర్కొన్న నియాంగ్ తమను భారతీయులుగా గుర్తించే రోజు ఎప్పుడు వస్తుందోనని ఆవేదన వ్యక్తంచేసింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నియాంగ్‌కు రీట్వీట్ ద్వారా హామీ ఇచ్చాడు.మరో ట్వీట్ లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈశాన్య ప్రాంత ప్రజల గుర్తింపు కోసం చర్యలు తీసుకోవటం ప్రారంభించిందని తెలిపాడు.
కాగా, ఈశాన్య ప్రాంతానికి చెందిన ప్రజలకు ఇలాంటి అవమానాలు గతంలో చాలానే జరిగిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వారిని భారతీయులుగానే పరిగణించాలన్న డిమాండ్ లెవనెత్తుతూ సోషల్ మీడియాలో కూడా తీవ్ర ఎత్తున్న ఉద్యమం లేపారు అక్కడి యువత. ఇక మరోపక్క ఈ ఘటనపై ఢిల్లీ టూరిజం శాఖ స్పందించింది. జమా మసీదులోని ప్రవేశ రుసుము ఫ్రీ కాగా, ఫోటోగ్రఫీ కోసం 200 రూపాయలు వసూలు చేస్తారంట. విషయం తమ పరిధిలోకి ఇంకా రాలేదని, విచారణ జరిపి సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more