ఎన్డీటీవీ పై బ్యాన్ | Govt tells NDTV India to shut down for a day.

Govt tells ndtv india to shut down for a day

NDTV India to shut down, NDTV ban, 1 day ban for NDTV, Government Bans NDTV, Pathankot Reportage, NDTV Pathankot Reportage, Pathankot attack NDTV, NDTV shuts down

Government Bans NDTV India for a Day Over Pathankot Reportage.

ప్రముఖ ఛానెల్ పై బ్యాన్ పడింది

Posted: 11/04/2016 08:29 AM IST
Govt tells ndtv india to shut down for a day

నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిరూపించింది. అత్యుత్సాహాంతో సున్నితమైన అంశాలను ప్రసారం చేసిన ఓ జాతీయ ఛానెల్ పై కొరడా ఝుళిపించింది. దీంతో సదరు ప్రముఖ జాతీయ వార్తా ఛానల్ ప్రసారాలు ఆగిపోనున్నాయి. అయితే అది కేవలం ఒక్కరోజే సుమీ. ఈ నెల 9 నుంచి 10 తేదీల మధ్య 24 గంటల పాటు ఎన్డీటీవీ ఛానెల్ ప్రసారాలను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరిలో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు... ఎయిర్ బేస్ లోని కీలక ప్రదేశాలను టీవీలో ప్రసారం చేసింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మండిపడింది. వార్తలను ప్రసారం చేసే క్రమంలో నిబంధనలను పాటించలేదంటూ ఈ ఆదేశాలను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల మేరకు ఈ నెల 9 వ తేదీ ఒంటి గంట నుండి 10 తేదీ ఒంటి గంట వరకు 24 గంటల పాటు ఎన్డీటీవీ హిందీ ప్రసారాలు నిలిచిపోనున్నాయి.

ఇది ముమ్మాటికీ మీడియా స్వేచ్ఛను హరించడమేనని ఎన్టీటీవీ నెట్ వర్క్ గత రాత్రి ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవాలను ప్రజలకు తెలిపే ప్రయత్నమే తప్ప, తామేమీ నిబంధనలు ఉల్లంఘించలేదంటూ అందులో పేర్కొంది. కాగా, ఇలా ఓ ఛానెల్ పై 24 గంటల బ్యాన్ విధించటం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఈ ఉత్తర్వులపై ఎన్డీటీవీ ట్రిబ్యునల్ ని ఆశ్రయించే అవకాశం కూడా ఉంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NDTV  Pathankot reportage  Central Govt  Ban. 1 day  

Other Articles