రతన్ టాటాపై కూడా నోరుపారేసుకున్న సబ్రహ్మణ్య స్వామి BJP MP Subramanian Swamy sensational comments on Ratan tata

Ratan tata most corrupt chairman in history of tata group says bjp mp subramanian swamy

tata group spat, tata saons controversy. ratan tata cyrus moistry, ratan tata corrupt, cyrus mistry sacked, subramanian swamy ratan tata

Bhartiya Janata Party (BJP) Rajya Sabha MP Subramanian Swamy called Tata Sons Chairman Ratan Tata as the most corrupt chairman in the history of Tata Group.

రతన్ టాటాపై కూడా నోరుపారేసుకున్న సబ్రహ్మణ్య స్వామి

Posted: 11/03/2016 02:51 PM IST
Ratan tata most corrupt chairman in history of tata group says bjp mp subramanian swamy

దేశంలో ఏదైనా వివాదంగా మారుతున్న.. అసలు నిర్వివాదాంశమైనా దానినిలోకి పరకాయ ప్రవేశం చేసి మరీ తన వివాదాస్పదం చేయడంలో ఆయన మహాదిట్ట. గతంలో కాంగ్రెస్ తో జతకట్టినప్పటి నుంచి ఆయన ధోరణి అదే. అయితే ఇప్పడు అధికార బీజేపితో జతకట్టిన తరువాత ఆయన కొంత శృతిమించారు. ఏకంగా ప్రపంచ అర్థిక వేత్తలు, నిఫుణల నుంచి ప్రశంసలందుకున్న అర్బీఐ గవర్నర్ రఘులరామ్ రాజన్ విధానాలను తూలనాడటంతో పాటు ఇటు తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం వరకు అయన చర్యలన్నీ వివాదాస్పదంగా వున్నాయి.

ఒకానోక దశలో ఆయన చర్యలపై స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా విస్మయానికి గురై.. తమ నేతలు అడ్డుఅదుపు లేకుండా బాహాటంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రపంచం శ్లాఘించిన మనవాల్లను కూడా పార్టీ నేతలు విమర్శిస్తున్నారని ఇది సరికాదని పరోక్షంగా చురకలంటించినా.. ఆయన విధానంలో మాత్రం మార్పు లేదు. ఇక మరికోందరు విమర్శకులైతే.. ఆయన ప్రధాని మౌత్ ఫీీస్ అని కూడా అభివర్ణస్తుంటారు. ప్రధాని హోదాలో ఆయన తనంతట తానుగా చేయలేని వ్యాఖ్యలను సుబ్రహ్మణ్యస్వామి ద్వారా చెప్పిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తుంటారు.

కాగా తాజాగా ఆయన మరో అంశంలోనూ జోక్యం చేసుకుని ఏకంగా రతన్ టాటాపై విమర్శలకు దిగారు. ఇన్నాళ్లు మచ్చలేని మహరాజులా వుంటూ వచ్చిన ఆయనను అత్యంత అవినీతి పరుడని విమర్శించారు. టాటా గ్రూప్ సంస్థల చరిత్రలో రతన్ టాటాయే అత్యంత అవినీతిపరుడు లేడని ఘాటు వ్యాక్యలు చేశారు. "ఆయన టాటా కాదు. ఆయన తండ్రి ఓ దత్త పుత్రుడని చెప్పుకోచ్చారు. రాయ్ పూర్ లో మీడియాతో మాట్లాడుతూ.. టాటా వల్ల సైరస్ మిస్త్రీ అన్యాయం గావించబడ్డారన్నారు.

సైరస్ మిస్త్రీని రెండు నెలల క్రితం టాటాల బోర్డు ఎంతోగానో మెచ్చుకుందని.. అయితే తనకు లభించాల్సిన ప్రశంసలు మిస్త్రీ కాజేశాడన్న ఈర్షతోనే రతన్ టాటా ఈ చర్యలకు పాల్పడివుంటారని ఆరోపించారు. 2జీ, ఎయిర్ ఆసియా, విస్తారా భాగస్వామ్య ఒప్పందం, జాగ్వార్ డీల్ వంటి కుంభకోణాల్లో రతన్ టాటాకు పాత్ర ఉందని ఆరోపించారు. స్కాముల్లో ఇరుక్కోకుండా తనను తాను కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని అన్నారు. రతన్ టాటా అవినీతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tata group spat  ratan tata  cyrus mistry  corruption  subramanian swamy  

Other Articles