ఎన్ కౌంటర్ స్పాట్ లో సెల్ఫీల పిచ్చి ... | bhopal encounter spot became tourist spot

Bhopal encounter spot became tourist spot

bhopal encounter spot, Manikhedi Pahadi encounter, bhopal encounter spot selfies, selfies at bhopal encounter

bhopal encounter spot became tourist spot swarmed by visitors.

రక్తపు మరకలపై సెల్ఫీల కోసం...

Posted: 11/02/2016 10:18 AM IST
Bhopal encounter spot became tourist spot

మనిషి తల్చుకుంటే ఏదైనా వింతే. చెట్టు, పుట్ట, కొమ్మ, కోన ఇలా దేనైనా అధ్బుతంగా మలచటంలో చాలా ప్రావీణ్యం సంపాదించాడు. అలా అని వార్తల్లో నిలిచే ప్రతీ దాన్ని వింత అనుకుంటే ఎలా? కానీ, మనకు అవేం పట్టవు కదా! రీసెంట్ భోపాల్ ఎన్ కౌంటర్ దీనికి తార్కాణంగా నిలిచింది. ఎలాగంటారా? మీరే చూడండి.

భోపాల్ సెంట్రల్ జైలు నుంచి ఎనిమిది మంది సిమీ ఉగ్రవాదులు తప్పించుకుని పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. ఎన్‌కౌంటర్ జరిగిన ఖెజ్రాడియో గ్రామంలోని మనిఖేడి పహాడీ ప్రాంతం ఇప్పుడు టూరిస్టు స్పాట్‌గా మారిపోయింది. ఆ ప్రాంతాన్ని చూసేందుకు స్థానికులే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. చిన్నారులను సైతం తమతో పాటు తీసుకొచ్చి చూపిస్తుండడం గమనార్హం.

ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడి ఉన్న ఉగ్రవాదుల చినిగిన దుస్తులు, ఎండిన రక్తపు మరకల వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంతేందుకు ఎన్ కౌంటర్ అయ్యాక అక్కడ క్లూస్ సేకరించిన కొందరు పోలీసులు కూడా అదే పని చేశారు కూడా. అసలు ఆ ప్రాంతాన్ని ఎందుకలా వదిలేశారని అదనపు ఎస్పీ ధర్మవీర్‌ను ప్రశ్నించగా సాక్ష్యాలు పూర్తిగా సేకరించామని, రక్తపు మరకలు మాత్రమే మిగిలిపోయాయని పేర్కొన్నారు.

bhopal encounter spot

కాగా జైలు నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులను పోలీసుల కంటే ముందు తామే చూశామని అక్కడికొచ్చిన చాలామంది చెబుతున్నారు. కర్రలతో పరిగెత్తిన ఎనిమిది మందిని తాము చూశామని గిరిధర్ అనే యువకుడు తెలిపాడు. సంతోష్ అనే ప్రత్యక్ష సాక్షి కథనం ప్రకారం.. సోమవారం పోలీసులు రావడానికి ముందే గ్రామస్తులు ఉగ్రవాదులను చుట్టుముట్టారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌కు ముందు ఓ ఉగ్రవాది మాట్లాడుతూ ‘‘మేం ఏం చేయాలో అది చేశాం. ఇప్పుడు మమ్మల్ని చంపుతామన్నా మాకు భయం లేదు’’ అని వ్యాఖ్యానించాడు. ఇక మరో వ్యక్తి తన ఫోన్ లో ఏకంగా ఎన్ కౌంటర్ నే వీడియో తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు ఫోన్ లాక్కుని డిలేట్ చేశారంట.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bhopal encounter spot  tourist spot  selfies  

Other Articles