అమ్మాయిల చేతులు... మగాళ్లకు గడ్డం | bizarre punishments of ISIS militants

Bizarre punishments of isis militants

bizarre punishments, ISIS punishments, Bite Women For Exposing Their Hands, ISIS lashings for beard, ISIS punishments terrific, ISIS militants, Iraq ISIS

ISIS Militants Bite Women For Exposing Their Hands, and lashings for beard.

అమ్మాయిల చేతులు కనిపిస్తే కరిచేయటమే...

Posted: 11/02/2016 07:25 AM IST
Bizarre punishments of isis militants

మన దేశం మాట సరేగానీ, ఇస్లామిక్ స్టేట్స్ లో శిక్షలు మాత్రం భలే భయంకరంగా ఉంటాయి. రేప్ చేస్తే నడిరోడ్డులో నరికేయటాలు, అసలు అమ్మాయిలను చూస్తే కళ్లు పీకేయాడాలు, చేయేస్తే రాళ్లతో కొట్టి చంపేయటాలు అక్కడ చాలా కామన్ గా కనిపిస్తుంటాయి. కానీ, ఐస్ఐఎస్ లాంటి ఉగ్రసంస్థ హవా నడుస్తుండటంతో మంది  ఆ శిక్షలు ఇప్పుడు మరింత వెరైటీగా మారిపోయాయి.

ఇందుకు తాజాగా జరిగిన ఉదాహరణలే చెప్పుకోవచ్చు. అక్కడి మహిళలు తప్పని సరిగా బురఖా ధరించాల్సిందే. కళ్లు, చేతులు తప్ప వంటిలో ఏ పార్ట్ కనిపించడానికి వీల్లేదు. పొరపాటున దానిని అతిక్రమిస్తే ఇక వారి పని అంతే. ఇకపై చేతులను కూడా ఆ లిస్ట్ లోకి చేర్చారు. పొరపాటున చేతులు కనిపించాయో మీద పడి కరిచేయటమే వారికి శిక్షనంట. ఇందుకోసం ప్రత్యేకంగా కోర్టు నిర్వహించి మరీ శిక్షలు విధిస్తుంది. అయితే ఆ పని(కరవటం) ఆడ ఉగ్రవాదులు మాత్రమే చేయాలన్న వెసులుబాటును కూడా కల్పించిందట.

ఇక ఇక్కడ ఇంకో శిక్ష గురింంచి చెబుకుందాం... ఇది మరీ టూ మచ్. పురుషులను వరుసగా నించోబెడతారు.. వారి పెరిగిన గడ్డాల్లో ఓ పెన్ను పెడతారు.. ఒకవేళ.. ఆ పెన్ను కిందపడిందా, ఇక అంతే.. కొరడాదెబ్బలు తప్పవు..! అక్కడి పౌరులను గడ్డాలు పెంచాలని ఐఎస్ ఆదేశించింది. కొన్ని రోజుల తర్వాత అక్కడి పౌరుల్లో కొందరిని నాలుగు రోడ్ల కూడలిలోకి తీసుకువచ్చారు. వారి గడ్డాల్లో పెన్ను పెట్టగా, కొందరి గడ్డాల్లో నుంచి అవి జారి కిందపడిపోయాయి. దీంతో, రెచ్చిపోయిన ఐఎస్ ఉగ్రవాది ఒకడు, గడ్డం సరిగ్గా పెంచడం లేదంటూ వీపు చిట్టిపోయేలా కొరడా దెబ్బలు కొట్టారంటూ బాధితులు వాపోయారు.

ఇరాక్ లోని ఐఎస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ఒక ప్రాంతంలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటాయి. ఇరాకీ దళాల రాకతో విముక్తి చెందిన మోసూల్ ప్రాంతంలోని అనేక పట్టణాలు, గ్రామాలు విముక్తి పొందాయి. ఆయా ప్రాంతాలకు చెందిన వారు తమకు జరిగిన దారుణాల గురించి చెప్పారు. రెండు నెలల క్రితం 19 మంది అమ్మాయిలను సెక్స్ బానిసలు గా మారలేదని బోనులో వేసి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారంట. వారికి బయపడి చూస్తూ ఉండిపోయామో తప్ప ఏం చేయలేకపోయామని స్థానికులు వివరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  bizarre punishments  

Other Articles