ఆట మొదలైందంటున్న అరుపుల అర్నబ్ | Arnab Goswami resigns as Editor-in Chief of Times Now

Arnab goswami resigns as editor in chief of times now

Arnab goswamy resigned, arnab new channel, senior journalist arnab goswamy, arnab goswamy quit times now, prime time arnab no more

Times Now Editor-in Chief Arnab Goswami quit.

‘అరుపుల’ అర్నబ్ రాజీనామా చేశాడు

Posted: 11/01/2016 07:37 PM IST
Arnab goswami resigns as editor in chief of times now

గత రెండు మూడు రోజులుగా టైమ్స్ నౌ చానెల్ లో అరుపులు లేవు. ఎందుకంటే ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోస్వామి కనిపించడం లేదు కదా. అవును ప్రైమ్ టైమ్ షో డిష్కషన్ ద్వారా రోజు గంటపాటు వాయించే ఈ సీనియర్ జర్నలిస్ట్ ఏమయ్యాడు అని అంతా ఆరాలు తీస్తున్నారు. అయితే అధికారికంగా ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ పదవి నుంచి తప్పుకున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ మేరకు ఇటీవల జరిగిన ఎడిటోరియల్‌ మీటింగ్‌లో ఆర్నబ్‌ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఆయన ఎడిటర్‌ పదవి నుంచి తప్పుకున్నట్టు సమాచారం. టైమ్స్‌ నౌ చానెల్‌లో ఆవేశపూరితమైన చర్చలు చేపట్టడం ద్వారా ఆర్నబ్‌ ప్రముఖంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఉడీ ఉగ్రవాద దాడి అనంతరం పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆర్నబ్‌ పలు ఆవేశపూరితమైన టీవీ చర్చలను నిర్వహించారు.

ఈ నేపథ్యంలో పలు ఉగ్రవాద సంస్థల నుంచి ఆయనకు ముప్పు ఉందనే ఇంటలిజెన్స్ వర్గాల సమాచారంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు 'వై కేటగిరీ' భద్రత కల్పించింది. దీంతో ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు సహా మొత్తం 20 మంది భద్రతా సిబ్బంది ఆయనకు నిరంతరం రక్షణ కల్పిస్తున్నారు. ఆర్నబ్‌ రాజీనామా వార్త తెలియడంతో ట్విట్టర్‌లో ఆయన ట్రేండ్‌ అవుతున్నారు.

కలకత్తాకు చెందిన ది టెలిగ్రాఫ్ పత్రిక ద్వారా 1994లో కెరీర్ ను ప్రారంభించిన అర్నబ్, ఏడాదికే అంటే 1995లో ఎన్డీటీవీలో కూడా పనిచేశారు. తన లౌడ్ నెస్ ద్వారా ముఖ్యంగా తనను ధ్వేషించే వారినే ఇంటర్వ్యూ చేయటం మూలానా పిచ్చ పాపులారిటీ సంపాదించాడు. అయితే సొంత ఛానెల్ ఆలోచన కారణంగానే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆట ఇప్పుడే మొదలైంది అని తోటి జర్నలిస్ట్ లతో అర్నబ్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. రాజీనామా వార్త బయటికి వచ్చినప్పటికీ, అర్నబ్ సంబంధించిన టీజర్లు ఇంకా ఛానెల్ లో ప్రసారం కావటం విశేషం.

ట్విట్టర్ నిండా జోకులే...

అర్నబ్ నిష్క్రమణపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, సోషల్ మీడియాలో మాాత్రం దానిపై జోకులు పేలుతున్నాయి. ఇప్పటిదాకా అర్నబ్ గోలను భరించిన జనాలు ఒక్కసారిగా తమ శైలిలో సెటైర్లతో పండగ చేసుకున్నారు. 

ఇంతకాలం టీవీలో అనధికార జడ్జీగా వ్యవహరించిన ఆర్నాబ్‌ ఇప్పుడు అధికారికంగా సుప్రీం కోర్టు జడ్జీగా వెళ్లేందుకు రాజీనామా చేశారు......కాదు, కాదు, పాకిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు భారత ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్లారు....అదికాదు, టాటా సన్స్‌ చైర్మన్‌ పదవిని చేపట్టేందుకు వెళ్లారు....ఆర్నాబ్‌ నిష్క్రమణతో టైమ్స్‌ నౌ ‘వ్యాల్యూ’ సారీ, సారీ ‘వ్యాల్యూమ్‌’ తగ్గింది......మొన్న టాటా సన్స్‌లో, నిన్న ట్విట్టర్‌లో, నేడు టైమ్స్‌ నౌలో ఉన్నత పదవులు ఖాళీ, అర్హులు ధరఖాస్తు చేసుకోండి....ఆర్నాబ్‌ రాజీనామా ఎలా చేసి ఉంటారు? కచ్చితంగా అరచి, గీపెట్టి చెప్పే ఉంటారు.....ఆయన చెప్పా పెట్టకుండా రాజీనామా చేస్తే ఎలా? నా అభిప్రాయం ఎలా ఉండాలో ఇప్పుడు నాకెవరు చెబుతారు?....ఎస్‌ఎమ్మెస్‌ పోల్‌ లేకుండా ఎలా రాజీనామా చేస్తారు?.....

‘24 గంటలపాటు ఆర్నాబ్‌ను భరించే ఛానెల్‌ పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా?....దీపావళి అంటే నిజంగా ఇదే, పటాసుల పేలుళ్లు లేకుండా ప్రశాంతంగా ఉంది....నేను మాత్రం ఒక్క క్షణం టపాసులు పేలుస్తా కాలుష్యం పోయినందుకు....తూ కిత్నే ఆర్నాబ్‌కో మారేగా హర్‌ ఛానెల్‌ సే ఏక్‌ ఆర్నాబ్‌ నిక్లేగా.....ఆర్నాబ్‌ నిష్క్రమణకు ఆందోళనే అవసరంలేదు ఛానెల్, ఆర్కీవ్స్‌ నుంచి పాత న్యూస్‌ అవర్‌ కార్యక్రమాల వీడియోలు ప్రసారం చేస్తే చాలు, తేడా ఎవరూ గుర్తించరు...’ అంటూ ట్వీట్లు ఇలా సాగిపోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Times now  editor-in-chief  arnab goswamy  resign  new channel  

Other Articles