నవ్వే ముందు నిజాలను తెలుసుకోండి బాస్... | The reality behind a viral video mocking a bank cashier is inspiring

The truth behind fastest woman cashier in the world

mocking a bank cashier , fastest cashier in the world, Pune woman bank employee video, premalatha shinde, bank cashier viral video, slow cashier

The reality behind a viral video mocking a bank cashier Premalatha Shinde is really inspiring.

ITEMVIDEOS:ఆమె ఒక్కతే... కానీ, కోటి మందికి సమానం

Posted: 10/31/2016 04:43 PM IST
The truth behind fastest woman cashier in the world

చెవులతో వినేదే కాదు.. ఒక్కోసారి కళ్లతో చూసేది కూడా నిజం కాకుండా పోవచ్చు. తొందరపాటులో అసలేం జరిగిందో ఆరాలు తీయకుండా అతి చేయటం మూలానా పరువు పోవటం తప్పించి సాధించేది ఏదీ ఉండదు. సోషల్ మీడియా బేస్ చేసుకుని జీవితాలు కొనసాగుతున్న కాలంలో నిజనిర్థారణలు అన్న కోణం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉందని తాజాగా జరిగిన ఓ ఘటన వివరిస్తోంది.

తాజాగా ఓ బ్యాంకులో పని చేసే మహిళా ఉద్యోగి నిదానంగా పని చేయటం గురించి సంబంధించి ఓ వీడియో బయటికి వచ్చిన మీరూ మీ ఫేస్ బుక్ లోనో, వాట్సాఫ్ లోనో చూసే ఉంటారు. క్యాష్ కౌంటర్ లో కూర్చున్న ఆమె నిదానంగా నోట్లు లెక్కించటం, అంతకన్నా నిదానంగా కంప్యూటర్ లో ఎంటర్ చేయటం, అక్కడి సీసీ టీవీ పుటేజీల్లో అదంతా నమోదయ్యింది.

 

ఇది చూసిన వారంతా ఎందుకురా అయ్యా! ఇలాంటి చాతకానీ ఉద్యోగులకు కూర్చోబెట్టి మా సహనంతో ఆడుకుంటారు.. కత్తి లాంటి నిరుద్యోగులు జాబులు లేక ఖాళీగా ఉన్నారు. వాళ్లకు ఇవ్వొచ్చుగా ఆ పని, ఆఖరికి పోయి ఇంట్లో కూర్చోవమ్మా... ఇలా ఎవరికి తోచినట్లు వాళ్లు పాపం ఆమె కామెంట్లు పెట్టారు. అక్టోబర్ 24న ఈ వీడియో పోస్ట్ కాగా, 13 మిలియన్ల వ్యూవ్స్ (13 కోట్లకు పైగా వీక్షించగా), 1,54,000 షేర్లు ఆ వీడియోకు వచ్చాయి. ఇక కామెంట్లు అన్ లిమిటెడ్.

అయితే ఆమె వెనుక ఉన్న కథ తెలిస్తే ఎవరైనా ఆమెకు సెల్యూట్ చేస్తారు. ప్రముఖ సామాజిక వేత్త కుందన్ శ్రీవాస్తవ ఆమెకు సంబంధించిన కథను అదే సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ చేసే పనిలో పడ్డాడు. ఆమె పేరు ప్రేమలత షిండే. పుణేకు చెందిన ఆమె భర్త చనిపోయి చాలా కాలం అయ్యింది. కొడుకు ఫ్యామిలీతో విదేశాల్లో సెటిల్ అయ్యాడు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో క్యాషియర్ గా పని చేస్తున్న ఆమె వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ కాబోతున్నారు. అన్నింటికన్నా మించి ఆమెకు పక్షవాతం ఉంది. రెండు సార్లు హర్ట్ ఎటాక్ కూడా వచ్చింది. ఆరోగ్యం బాగోలేనప్పుడు రావాల్సిన అవసరం ఏంటంటారా? ఆర్థిక స్థితి బాగోలేదు అనుకుంటున్నారా?

కాదండీ బాబూ. ఆమె సంపాదించిందే గాక, కొడుకు కూడా డబ్బు పంపుతుంటాడు. పైగా సరిపడినని లీవులు ఉన్నాయి. కానీ, ఆమె తన విధుల నుంచి మర్యాద పూర్వకంగా రిటైర్ట్ కావాలని ఆలోచిస్తోంది. అందుకే పరిస్థితి బాగోలేకపోయిన రెగ్యులర్ గా ఆఫీస్ కు వస్తోంది. ఇది తెలుసుకోకుండా ఆమె గురించి ఇలా... !

చూడు.. బాలరాజ్ బాబాయ్... నీ చేష్టలతో నువ్వు సోషల్ మీడియాలో హీరో అయిపోయావని ఫీలవుతున్నావేమో!  ‘ఫాస్టెస్ట్ క్యాషియర్ ఇన్ ద వరల్డ్’ అంటూ ఫన్నీగా వీడియో పెట్టడం కాదు. అన్నీ సక్రమంగా ఉన్న నువ్వు ఏం చేస్తున్నావో తెలీదుగానీ, ఈ వీడియోతో మాత్రం నీ పరువు అదోపాతాళానికి మాత్రం ఖచ్ఛితంగా పడిపోయింది. కాబట్టి స్నేహితులారా... మెరిసేదంతా బంగారం కాదని అర్థం చేసుకోండి. అట్ట చూసి పుస్తకాన్ని తక్కువ అంచనా వేయకండి. 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bank of Maharashtra  Premalatha Shinde  Fastest Cashier of the world  truth  

Other Articles