వీళ్లను మించిన బిజినెస్ మెన్ లు ఉంటారా? | telugu states top in easiest states of to do business.

Telugu states top in easiest states of to do business

easiest states to do business 2016, Andhra Pradesh, Telangana business, Ease of Doing Business, Andhra Pradesh, Telangana joint toppers, Telangana business 2016, KCR real businessman

Andhra Pradesh, Telangana easiest states to do business.

ఇద్దరు చంద్రుళ్ల బిజినెస్ అదిరిపోయింది

Posted: 10/31/2016 02:55 PM IST
Telugu states top in easiest states of to do business

ఈ మాట ఏ సీపీఐ నారాయణో లేక మరెవరో చేసిన కామెంట్ కాదు. నిజంగానే తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజినెస్ చేయటంలో దేశంలోని అందరినీ మించిపోయారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈఫ్ డూయింగ్ బిజినెస్ పై ఏటా ర్యాంకులను విడుదల చేస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ఫస్ట్ ఫ్లేస్ లో నిలిచాయి. గతేడాది ఫస్ట్ ప్లేస్ లో ఉన్న గుజరాత్ ను వెనక్కి నెట్టి తెలుగు స్టేట్స్ ఈ ఘనత సాధించాయి.

మొత్తం 340 అంశాలకు సంబంధించి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి ర్యాంకులను ఇస్తోంది. వాణిజ్య మంత్రిత్వ శాఖతోపాటు వరల్డ్ బ్యాంక్ కూడా ఈ జాబితా తయారీకి సహకారం అందిస్తుంది. మొత్తం 98.78 స్కోరుతో ఈ రెండు రాష్ట్రాలు టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఈ నివేదికను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ లో వెల్లడించడం విశేషం.

అయితే గతేడాది 2వ స్థానంలో ఉన్న ఏపీ, మొదటి స్థానం కైవసం సొంతం చేసుకోగా, 13వ స్థానంలో ఉన్న తెలంగాణ.. ఏకంగా 12 స్థానాలను మెరుగుపర్చుకొని నెంబర్ వన్ పొజిషన్ చేరుకోవటం చెప్పుకోదగిన అంశం. ఈ మధ్య ప్రతీ అంశంలో పోటీ పడుతూ చెరో దాంట్లో పై చేయి సాధిస్తున్న ఈ రెండు రాష్ట్రాలు ఒకే స్థానంలో నిలవటం విశేషం.

ఇక గుజరాత్ రెండు, ఛత్తీస్ గఢ్ మూడో స్థానంలో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలలో నాణ్యత ప్రమాణాలు మెరుగుపడాలని నివేదిక పేర్కొంది.


టాప్ రాష్ట్రాలు ఇవే...

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ

గుజరాత్

ఛత్తీస్ గఢ్

మధ్యప్రదేశ్

హర్యానా

జార్ఖండ్

రాజస్థాన్

ఉత్తరాఖండ్

మహారాష్ట్ర

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana  joint toppers  easiest states to do business 2016  

Other Articles