8 గంటల్లోనే ఎన్ కౌంటర్ లో ఏసేశారు | 8 SIMI Activists killed in Bhopal encounter

Simi activists killed in bhopal encounter

8 SIMI Activists killed in encounter, SIMI Fled Bhopal Central Jail, SIMI Activists encountered, SIMI terrorists killed in Bhopal encounter

8 SIMI Activists killed in encounter Who Fled Bhopal Central Jail.

ఆ టెర్రరిస్ట్ లను ఎన్ కౌంటర్ లో ఏసేశారోచ్...

Posted: 10/31/2016 12:33 PM IST
Simi activists killed in bhopal encounter

ఇండియన్ పోలీస్ వ్యవస్థను తక్కువ అంచనా వేస్తే ఏం జరుగుతుందో ఉగ్రవాదులకు తెలిసొచ్చే ఘటన ఇది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ కేంద్ర కారాగారం నుంచి 8 మంది ఉగ్రవాదులు త‌ప్పించుకున్న సంగతి తెలిసిందే. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కాపలాగా ఉన్న సెక్యురిటీ కానిస్టేబుల్ రామ్ శంకర్ ను నిర్దాక్షిణ్యంగా గొంతు కోసి వారి పారిపోయారు. దీంతో ఉగ్రులైన ఖాకీలు వెనువెంటనే రంగంలోకి దిగి వారిని హ‌త‌మార్చారు. వారి కోసం ముమ్మ‌ర గాలింపు జ‌రిపిన పోలీసులు అన్ని ప్రదేశాల్లో క్షుణ్ణంగా త‌నిఖీలు చేసి త‌క్కువ స‌మ‌యంలోనే వారి ఆచూకీని కనిపెట్టారు.

భోపాల్ శివారులోని ఎన్‌కేడీలో వీరి జాడలు పసిగట్టిన పోలీసులు అనంతరం ఎన్ కౌంటర్ జరిపి మట్టుబెట్టారు.. కాల్పుల్లో ముజీబ్ షేక్, అబ్దుల్ మజీద్, మహ్మద్ ఖాలీద్ అహ్మద్, సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు హ‌త‌మ‌య్యారు. ఉగ్రవాదులను ఎలాగైనా పట్టుకోవాలన్న పోలీసుల దృఢ నిశ్చయం భోపాల్ నగరాన్ని, చుట్టు పక్కల ప్రాంతాలనూ దిగ్బంధం చేయగా, ఈ ఎనిమిది మందీ పోలీసుల కళ్లు గప్పి ఎక్కువ దూరం ప్రయాణించలేకపోయారు.

కానిస్టేబుల్ ను చంపి ఉగ్రవాదుల పరార్

ఇనుప ప్లేట్ లతో రామ్ కుమార్ ను చంపిన తర్వాత 14 అడుగుల గోడను బెడ్ షీట్ల సాయంతో దూకి తప్పించుకున్నారు. పారిపోయిన తరువాత అందరూ విడిపోకుండా, ఒకే గ్రూప్ గా కలసి వుండటంతో కేవలం 8 గంటల వ్యవధిలోనే వారు దొరికిపోయారు. రాత్రి 2 గంటలకు జైలు నుంచి పారిపోయిన వారిని ఉదయం 10 గంటల సమయంలో పోలీసులు గుర్తించారు. భోపాల్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న, ఇంత్ కేడీ గ్రామ సమీపంలో వీరిని గుర్తించారు.

తమకు లొంగిపోవలసిందిగా పోలీసులు వారిని కోరినప్పటికీ, వారు వినిపించుకోకుండా, పరుగు లంఘించుకోవడంతో కాల్పులు జరపక తప్పలేదని, కాల్పుల్లో వారంతా హతమయ్యారని ఓ పోలీసు అధికారి వివరించారు. మొత్తానికి పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుందామనుకున్న వారి పాచిక పారలేక ప్రాణాలు తీసేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయటంతోపాటు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన రామ్ శంకర్ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles