అలర్ట్: కానిస్టేబుల్ ను చంపి టెర్రరిస్టుల పరార్ | 8 SIMI Terrorists Escaped From Bhopal Prison.

8 simi terrorists escaped from bhopal prison

SIMI terrorists, SIMI terrors killed constable, SIMI Head constable, terrorists kill head constable, bhopal jail SIMI escape, SIMI terrorists escaped, terrorists escaped from prison after killed constable, 8 SIMI terrorists, Head Constable Rama Shankar

After Killing Guard 8 Terrorists Of Banned Group SIMI Escape From Bhopal Prison.

కానిస్టేబుల్ ను చంపి ఉగ్రవాదుల పరార్

Posted: 10/31/2016 08:40 AM IST
8 simi terrorists escaped from bhopal prison

పండగ వేళ దేశాన్ని వణికించే వార్త ఒకటి పొద్దుపొద్దునే బయటికి వచ్చింది. 8మంది కరడుగట్టిన ఉగ్రవాదులు జైలు నుంచి తప్పించుకున్నారనే విషయంతో భద్రతా దళాలు ఉలిక్కిపడ్డాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సెంట్రల్ జైలు నుంచి  నిషేదిత ఉగ్రవాద సంస్థ సిమీ (స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఇండియా) ఉగ్రవాదులు ఆదివారం రాత్రి పారిపోయారు. ఈ క్రమంలో అడ్డుకున్న జైలు సెక్యూరిటీ గార్డును అత్యంత దారుణంగా హత్య చేశారు.

సిబ్బంది అంతా దీపావళి వేడుకల కోసం ఇంటికే పరిమితం కాగా, హెడ్ కానిస్టేబుల్ రామ శంకర్ మాత్రం విధులు నిర్వహించాడు. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు  ఆయన గొంతు కోసి మరీ వారు ఎస్కేప్ అయ్యారు. గోడలు ఎక్కేందుకు దుప్పట్లను వాడినట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మధ్యప్రదేశ్ హోం మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు.

కాగా, మూడేళ్ల క్రితం సిమీకి చెందిన 7 గురు ఉగ్రవాదులు భోపాల్ లోని కాంద్ వా జైలు బాత్ రూం గొడలు బద్దలు కొట్టి పారిపోగా, వారి ఆచూకీ ఇంత వరకు కనిపెట్టలేకపోయారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhopal Central Jail  SIMI terrorists  escape  kill  constable  

Other Articles