కివీస్ ముందు 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన ధోని సేన India vs NZ 5th ODI Live: Hosts reach 269/6 in 50 overs

India vs nz 5th odi live hosts reach 269 6 in 50 overs

India vs New Zealand, 5th ODI, Vizag, MS Dhoni, Kane Williamson, jayanth yadav, jasprit bumrah, Teamindia, new zealand, fifth one day, vishakapatnam, Cricket, sports

Half-centuries by Virat Kohli and Rohit Sharma helped India post a total of 269/6 in the fifth and final One-Day International (ODI) against New Zealand

కివీస్ ముందు 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్ధేశించిన ధోని సేన

Posted: 10/29/2016 05:41 PM IST
India vs nz 5th odi live hosts reach 269 6 in 50 overs

పర్యాటక జట్టు న్యూజిలాండ్తో ఐదు వన్డల సిరీస్ లో భాగంగా విశాఖలోని వైఎస్ రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో న్యూజీలాండ్ ఎదుట టీమిండియా 270 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నభారత్ జట్టుకు రోహిత్ శర్మ-అజింక్యా రహానేలు జోడి మంచి ఆరంభాన్ని అందించారు. కాగా, రహానే(20) తొలి వికెట్గా వెనుదిరిగినా, రోహిత్-విరాట్ కోహ్లిల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. ఈ జోడి 79 పరుగుల భాగస్వామ్యం జోడించిన తరువాత రోహిత్ శర్మ (70;65 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లు)రెండో వికెట్ గా అవుటయ్యాడు.  

ఆ తరువాత వచ్చిన ధోని.. విరాట్ తో జతకలసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాంట్నార్ బౌలింగ్లో వికెట్లు ముందు దొరికిపోయిన దోని పెవీలియన్ కు చేరాడు, ఆ వెనువెంటనే మనీష్ పాండే డకౌట్గా అవుటయ్యాడు. అ తరువాత 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ(76 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) కూడా నిష్ర్కమించడంతో భారత స్కోరు బోర్డు నెమ్మెదించింది.

చివరి 10 ఓవర్లలో భారత్ రెండు వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. అక్షర్ పటేల్(24), కేదర్ జాదవ్(39) ఒత్తిడిలోనూ ఫర్వాలేదనిపించారు. న్యూజీలాండ్ బౌలర్లు స్లో బౌలింగ్ లోనూ పరుగులను రాబట్టడంతో నిర్ణీత 50.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయిన టీమిండియా 269 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సోథీ తలో రెండు వికెట్లు సాధించగా, నీషమ్, సాంట్నార్లకు చెరో వికెట్ కు దక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teamindia  new zealand  India vs New zealand  fifth one day  vishakapatnam  

Other Articles