ఆర్కే... జస్ట్ ఎలా మిస్సయ్యాడబ్బా? | operation RK at AOB after huge encounter

Operation rk at aob after huge encounter

Operation RK, Mao top leader RK escaped, AOB encounter, Malkangiri Encounter, Operation RK failed, How RK escaped from Encounter

Operation RK for Rama Krishna at AOB after huge encounter.

అడవిలో అన్న ఎలా మాయమయ్యాడు?

Posted: 10/26/2016 07:15 AM IST
Operation rk at aob after huge encounter

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో కీలక నేత ఉదయ్ దళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన విషయం తెలిసిందే. మరోవైపు మృతుల్లో కీలకనేతలు ఉండగా, మరికొందరు తృటిలో తప్పించుకున్నారు. అయితే గాయపడినట్టుగా చెబుతున్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ, అలియాస్ ఆర్కే ఇప్పుడు ఎక్కడున్నారనే విషయంపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఆయన నిఘా వర్గాల అదుపులో ఉన్నారా? లేక క్షేమంగా తప్పించుకున్నారా? అన్న విషయంపై విస్తృతంగా చర్చించుకుంటున్నారు.

మరోవైపు ఎన్‌కౌంటర్ నుంచి ఆయన తప్పించుకున్నారని, మావో రక్షణ దళం ఆయనను అక్కడి నుంచి క్షేమంగా తప్పించిందని, ఈ క్రమంలో ఆయన గాయపడ్డారని సమాచారం. పోలీసుల కాల్పుల్లో మరణించిన వారిలో ఆర్కే గన్‌మెన్‌గా భావిస్తున్న ముగ్గురిని గుర్తించారు. తప్పించుకున్న ఆర్కే కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. 800మంది పోలీసులు అణువణువు గాలిస్తున్నారు. తప్పించుకున్న ఆర్కేతోపాటు గాజర్ల రవి అలియాస్ గణేశ్, ఆయన సెక్యూరిటీ సిబ్బంది 20 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది. వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో పోలీసుల జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టారని సమాచారం.

ఆర్కేను సజీవంగా పట్టుకోవడమో, లేదంటే మట్టుబెట్టడమో ఏదో ఒకటి చేయాలనే లక్ష్యంతో బలగాలు ఉన్నాయి. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కోరాపుట్, మల్కనగిరి, గుమ్మ తదితర ప్రాంతాల్లో ఏకంగా 13 సెక్యూరిటీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.

టార్గెట్ ఆర్కే...
మావో అగ్రనేత అసలు పేరు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ(ఆర్కే). ఏవోబీ కార్యదర్శిగా పనిచేసిన ఆర్కే ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం జరిపిన శాంతిచర్చల్లో పాల్గొన్న మావోయిస్టుల బృందంలో ఆర్కే కూడా ఉన్నారు. ఆ తర్వాత పలుమార్లు జరిగిన ఎన్‌కౌంటర్ల నుంచి ఆయన తప్పించుకున్నారు. ఆర్కే లక్ష్యంగా ఎప్పటినుంచో పని చేస్తున్న పోలీసు బలగాలు ఆ మధ్య గాలికొండ ఏరియా, దంతెవాడ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్కే హతమయ్యాడని తొలుత వార్తలు వచ్చినా.. తర్వాత అవి వాస్తవం కాదని తేలింది.

తాజాగా ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ లక్ష్యం కూడా ఆర్కేయేనని పోలీసు వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. అయితే దాడి నుంచి రెప్పపాటులో ఆయన తప్పించుకోగా, ఆయన తనయుడు మున్నా అలియాస్ రవి అలియాస్‌ పృథ్వీ మరణించాడు.

ఇక కొడుకు మరణంపై ఆర్కే భార్య శిరీష స్పందించింది. ఏవోబీలో మావోయిస్టులను పోలీసులు దొంగదెబ్బతీశారని ఆమె ఆరోపించారు ఆర్కే భార్య శిరీష. బిడ్డను కోల్పోయి కడుపుకోత అనుభవిస్తున్నా… పీడిత ప్రజల కోసం చేసిన త్యాగం గర్వంగా ఉందన్నారు. తన కోసం తాను బ్రతకడం కంటే ఇతరుల కోసం జీవించడంలో ఆనందం ఉందని చెప్పే తన బిడ్డ… ప్రజల కోసమే ప్రాణాలు ఆర్పించాడన్నారు ఆమే. మరోవైపు ఏవోబీలో జరిగింది ముమ్మాటికీ బూటకపు ఎన్‌కౌంటరేనన్న విరసం నేత వరవరరావు. ముమ్మాటికీ ఇది హత్యే. సిట్టింగ్ జడ్జితో ఘటనపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AOB  encounter  Maoist top leader  Rama Krishna Alias RK  

Other Articles