మోదీ ఫోటో వాట్సాప్ లో పెడితే కేసా? | Case against man for posting objectionable photo of Modi

Case against man for posting objectionable photo of modi

Modi objectionable photo, Muzaffarnagar Man arrest Modi Photo, Modi objectionable photo whats app, Modi Photo viral in Whats App, objectionable photo of Modi, objectionable post on Modi

Case against man for posting objectionable photo of Modi in Muzaffarnagar.

మోదీ ఫోటోతో ఇంకో కేసు నమోదు!

Posted: 10/26/2016 08:08 AM IST
Case against man for posting objectionable photo of modi

సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలు అన్నీ రోడ్డెక్కేస్తున్నాయి. పనిలో పనిగా ఫోటో షాప్ పనిమంతుల మూలంగా మార్ఫింగ్ ఫోటోలు కూడా వైరల్ అయిపోతున్నాయి. అగ్ర నేతలు అని కూడా చూడకుండా వారు చేస్తున్న చిలిపి పనులకు కటకటాలు పాలు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ముజఫర్ నగర్ లో ఓ వ్యక్తికి కూడా ఇలాంటి అనుభమే ఎదురైంది.

అతగాడు ఏకంగా ప్ర‌ధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోల‌నే మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టేశాడు. అంతేకాదు ఫ్రెండ్స్ గ్రూప్ లలో వాటిని వైరల్ కూడా చేశాడు. వాట్స‌ప్‌ గ్రూప్‌లో అభ్యంతరకరంగా పెట్టిన మోదీ ఫొటోను గ‌మ‌నించిన ఓ బీజేపీ కార్యకర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. వాట్స‌ప్ గ్రూప్‌లో ఉన్న ఆ ఫొటో మోదీని అవమానప‌రిచేలా ఉంద‌ని నిర్ధారణకు వచ్చిన పోలీసులు మొత్తానికి ఎలాగోలా సదరు యువకుడిని పట్టేసుకున్నారు. ఐపీసీ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన‌ట్లు, విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

గతంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. ఆగ్రాకు చెందిన ఇద్దరు యువకులు కూడా ఇదే రీతిలో మోదీ ఫోటోను మార్ఫింగ్ చేసి చిక్కులు ఎదుర్కున్నారు కూడా. పూణేకి చెందిన ఓ యువతి కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  objectionable photo  Muzaffarnagar Man  arrest  

Other Articles