హెడ్ కానిస్టేబుల్ లంచంతోనే రాజీవ్ హత్య జరిగిందంట... | Head Constable 200 rupees bribe for Rajeev Gandhi's Murder.

200 rupees bribe for rajeev gandhi s murder

200 rupees bribe Rajeev Gandhi, Rajeev Gandhi Murder, Nalini request Rajeev Gandhi, Justice Chandra Kumar Rajeev Gandhi Murder, Head Constable Bribe for Rajeev's Murder, 200 Rupees cause for Rajeev Gandhi's Murder, Rajeev Gandhi Suicide Bomb Attack, Head Constable Bribe Rajeev Gandhi

Justice Chandra Kumar says we lost Rajeev Gandhi for a Head Constable 200 rupees Bribe.

రాజీవ్ హత్యకు 200 రూపాయల లంచం!

Posted: 10/24/2016 08:51 AM IST
200 rupees bribe for rajeev gandhi s murder

సామాజిక తెలంగాణ అంటూ పోరాటం కొనసాగిస్తున్న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా కేసీఆర్ సర్కార్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసిన ఆయన ఇప్పుడు ఏకంగా రాజీవ్ గాంధీ హత్యపై స్పందించాడు. కేవలం 200 రూపాయల లంచం కోసం మాజీ ప్రధానిని కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్‌ ఆదివారం నిర్వహించిన సదస్సులో ప్రసంగిస్తూ... రూ.200 లంచానికి ఆశపడ్డ ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకం వల్లనే ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడికి పాల్పడగలిగిందని ఆయన పేర్కొన్నారు.

సమాజంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన అవినీతిని కూకటివేళ్లతో పెకలిస్తే తప్ప ఫలితం ఉండదన్నారు. రాజీవ్ గాంధీతో దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉండేదన్న ఆయన, బతికి ఉంటే అగ్రరాజ్యాలతో పోటీపడే స్థాయిలో ఖచ్చితంగా నిలిచేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఏళ్ల తరబడి పేరుకు పోయిన అవినీతిని కూకటి వేళ్లతో పెకిలిస్తేనే ఫలితాలు ఉంటాయని జాతీయ అవినీతి నిర్మూలన కౌన్సిల్‌ ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పేర్కొన్నారు.

ఆరోజు ఏం జరిగింది...

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 21, 1991 ఒరిస్సా(ఇప్పుడు ఒడిశా), వైజాగ్ లలో పాల్గొన్న అనంతరం చెన్నైలోని పెరంబదూర్ లో నిర్వహించిన ఓ సభలో పాల్గొన్నారు. సభాస్థలికి వెళ్లిన సమయంలో ముందుగా ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు రాజీవ్ గాంధీ. అనంతరం అక్కడున్న వారికి అభివాదం చేసుకుంటు సభా స్థలిలో ఎర్ర తివాచీ స్థలానికి చేరుకున్నారు. లంచం తీసుకున్న ఓ హెడ్ కానిస్టేబుల్ విషయం తెలీక మానవ బాంబు రూపంలో ఉన్న మహిళను రాజీవ్ కు సమీపంగా పోనిచ్చాడు. అదే అవకాశం కోసం ఎదురు చూస్తున్నఎల్టీటీఐ సభ్యురాలు ధాను ముందుకు కదిలింది. మెడలో చందనపు పూల మాల వేసేందుకు అన్నట్లు రాజీవ్ గాంధీ వద్దకు వెళ్లి వంగింది. అంతే తన నడుముకు చుట్టుకున్న బాంబు మీటను నొక్కింది. అంతే ఒక్కసారిగా భీకర పేలుడు రాజీవ్ గాంధీతో పాటు..15 మంది పైకి గాలిలోకి ఎగిరారు. 20 అడుగుల ఎత్తువరకు అగ్ని జ్వాలలు ఎగిరాయి. కాంగ్రెస్ నేత జీకే మూపనార్ లాంటి వాళ్లు తమ ప్రియతమ నేత కోసం ఆ పొగలోనే వెతికారు. మొదటగా రాజీవ్ గాంధీ బూట్ దొరికింది. తల వేరో చోట పడింది. అంతే ఇక రాజీవ్ లేరని నిర్థారించుకున్నారు. వెంట ఉన్న మరో ఇద్దరు నేతలు మూపనార్, రామ్మూర్తి వెంటనే తమ శాలువా తీసి రాజీవ్ శరీరం మీద కప్పి స్ట్రైచర్ కోసం కబురు పంపారు. అప్పటికే అంతా అయిపోయింది.

మొత్తం ఈ దాడిలో 15 మంది మృత్యు వాత పడగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించారు. శ్రీలంక నుంచి వచ్చిన మానవ బాంబు ధాను, శోభాలతో పాటు..నళిలి, మురుగన్, ఒంటికన్ను శివరాజన్, పయాస్, అరివు, భాగ్యనాధన్ సుబ్రమణ్యం తదితరులు ఈ పేలుడులో సూత్రధారులుగా నిర్థారించారు. రాజీవ్ గాంధీ హత్య కేసును విచారించిన సిట్ బృందానికి డి.ఆర్. కార్తికేయన్ ఎంతో ఓపిగ్గా..చాక చక్యంగా ఈ విషయాలను వెలికి తీశారు. అనంతరం వారికి శిక్ష పడింది.

నళిని మరోసారి...

కాగా, తన విడుదలపై చొరవ తీసుకోవాలంటూ జాతీయా మహిళా కమిషన్ కు నిందితురాలు నళిని ఓ లేఖ రాసింది. ‘‘రోజురోజుకు ఆశలు అడుగంటిపోతున్నాయి. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నా. నేను కంటతడి పెట్టని రోజు లేదు. విడుదల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా. రోజులు వస్తున్నాయి. పోతున్నాయి. నాకు మాత్రం విడుదల లభించడం లేదు. అసలు ఏనాటికైనా నేను విడుదలయ్యే అవకాశం ఉందా?’’ అంటూ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని నళిని అడ్వకేట్ పి.పుగాఝెంతి ఆదివారం మీడియాకు తెలిపారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Justice Chandra Kumar  Rajeev Gandhi Murder  Bomb Attack  200 Rupees Bribe  

Other Articles