కాంట్రాక్టు కార్మికులకు తీపికబురును అందించిన సీఎం AAP govt to regularise contractual staff

Aap moves towards regularising contractual staff

Aam Aadmi Party, contractual staff, Delhi Cabinet, delhi contract employees, delhi chief minister, Arvind Kejriwal, Delhi CM, DJB, Satyendra Jain, Kapil Mishra, Imran Hussain, MCD, Mohalla Clinics

The Delhi Cabinet, in its meeting chaired by Chief Minister Arvind Kejriwal, today directed all departments of the government to send finalised proposals for regularisation of all employees working on contract to the Chief Secretary by November 15, 2016. Apart from that, several other issues were also discussed in the meeting.

కాంట్రాక్టు కార్మికులకు తీపికబురును అందించిన సీఎం

Posted: 10/24/2016 09:04 AM IST
Aap moves towards regularising contractual staff

కాంట్రాక్టు ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపి కబరును అందించారు. కాంట్రాక్టు కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఎన్నికల హామిని ఇచ్చిన.. అధికారంలోకి వచ్చిన తరువాత అ మేరకు అదేశాలను కూడా జారీ చేసిన వారి జాబితాను సైతం సిద్దం చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాత్కాలికంగా ఆ అంశాన్ని అటెకెక్కించింది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో ఎన్నికల హామీని ఇచ్చింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు కార్మికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ప్రభుత్వ హాయంలో పనిచేస్తున్న 70 వేలకు పైగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఢిల్లీ రాష్ట్ర అన్ని ప్రభుత్వశాఖలను కాంట్రాక్ట్ ఉద్యోగుల జాబితాను నవంబర్ 15లోగా సమర్పించాలని ఆదేశించారు. డెబ్భై వేలకు పైగా ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించినట్లు అన్ని కార్యాలయాల అధికారులకు తెలిపారు.అన్ని శాఖల అధికారులు దీనిపై తమ ప్రతిపాదనలను చీఫ్ సెక్రటరీకి తెలియజేయాలని కేజ్రీవాల్ చెప్పారు. ఇప్పటికే గెస్ట్ టీచర్స్ ను పర్మినెంట్ చేయాలన్న దానిపై పూర్తి వివరాలను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) నజీబ్ జంగ్ కు సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

తమ ప్రతిపాదనలను ఎల్జీ అంగీకరించని పక్షంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్తానని ఆయన స్పష్టంచేశారు. ఈ విషయంపై ఆయన ఎంతో పట్టుదలగా కనిపిస్తున్నారు. వచ్చే ఏడాది మునిసిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సీఎం కేజ్రీవాల్ ఈ చర్యలు చేపట్టారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 17,000 మంది గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఢిల్లీ శాసనసభకు 2013, 2015లలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో ఆప్ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చిన విషయం విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : delhi contract employees  delhi chief minister  Arvind Kejriwal  Delhi CM  

Other Articles