గాలి వారి పెళ్లిపై ఐటీ సంస్థ నిఘా.. హాజరుకానున్న ప్రధాని IT dept urged to monitor Reddy daughter’s wedding

It dept urged to monitor reddy daughter s wedding modi sushma among invitees

gali janardhan reddy, brahmani reddy wedding invitation, invitaion card, PM modi, sushma swaraj, Lokayukta, IT monitors, bs yeddyurappa, bengaluru, karnataka

Former Karnataka Lokayukta has also asked that the Income Tax department to monitor the expenses of Gali Janardhan Reddy daughter’s wedding.

గాలి వారి పెళ్లిపై ఐటీ సంస్థ నిఘా.. హాజరుకానున్న ప్రధాని

Posted: 10/21/2016 11:02 AM IST
It dept urged to monitor reddy daughter s wedding modi sushma among invitees

కర్ణాటక మాజీ మంత్రి, బీజేపి నేత గాలి జనార్ధన్‌రెడ్డి.. తన కూతురు బ్రహ్మణీ వివాహానికి అతిధులను అహ్వానిస్తూ పంపిన పెళ్లి పత్రికలు నెట్టంట్లో సంచలనం రేపి పెద్ద దుమారానికి దారితీయడం.. ఏకంగా జాతీయ మీడియాలో కూడా పెళ్లి పత్రిక చర్చనీయాంశంగా మారడంతో.. కర్ణాటకలోని లోకాయుక్త ఆయనపై నిఘాను విధించింది. ఈ వివాహంపై నిఘాను ఏర్పాటు చేయాలని ఐటీ శాఖ అధికారులకు మాజీ లోకాయుక్త అదేశాలు జారీ చేసింది.

గాలి జనార్థనరెడ్డి తన కూతురి పెళ్లి అహ్వాన పత్రిక ఇప్పటివరకు చూసిన పత్రికలకు భిన్నంగా వుంటుంది. కార్డు తెరచి తెరవంగానే.. తమ అమ్మాయి పెళ్లికి తప్పక రండీ అంటూ గాలి జనార్థన్ రెడ్డి కుటుంబసభ్యులు అహ్వానిస్తూ.. వీడియో ప్లే అవుతుంది. బ్రహ్మణి వెడ్స్ రాజీవ్ రెడ్డి అనే వధూవరుల పేర్లతో ఈ వీడియో ప్రారంభమవుతుంది. దీంతో కేవలం వివాహ పత్రిక అహ్వానికికే ఇంత ఖర్చు చేస్తే.. ఇక పెళ్లికి ఎంత మేరకు ఖర్చుచేస్తారో అన్ని కామెంట్లు కూడా నెట్ జనుల మదుల నుంచి వెల్లువెత్తాయి.

వచ్చే నెల జరగనున్న ఈ గ్రాండ్ వెడ్డింగ్ కు గాలి జనార్థన్ రెడ్డి ఎంత మేరకు ఖర్చు పెట్టనున్నారో అన్న సందేహాల నేపథ్యంలో కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే స్పందించారు. గురువారం అయన సంబంధిత ఐటీ అధికారులను గాలి జనార్థన్ రెడ్డి వివాహానికి గాను ఖర్చు చేసే మొత్తాన్ని పర్యవేక్షించాలని ఐటీ అధికారులకు సూచించారు. ఈ డబ్బులన్నీ ఆయన అక్రమ గనుల త్వకాలను నుంచి అర్జించినవేని అందుకే వివాహం ఖర్చులపై నిఘాను ఏర్పాటు చేయాలని అదేశించారు.

మెట్టు దిగి వచ్చిన గాలి.. పెద్దగా ఖర్చు చేయడం లేదని వ్యాఖ్య

లోకాయుక్త అదేశాల నేపథ్యంలో గాలి జనార్థన్ రెడ్డి మొట్టు దిగివచ్చాడు. తన కుమార్తె బ్రాహ్మణి వివాహ మహోత్సవం ఖర్చులపై అదాయపన్ను శాఖ అధికారులు నిఘా పెడుతున్నారన్న సమాచారంతో అయన వివాహ ఖర్చుపై స్పందించారు. తన కూతురు వివాహాం సందర్భంగా భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదని ఆయన నమ్మిన బంటు, స్నేహితుడు, బళ్లారి ఎంపీ బి.శ్రీరాములు అన్నారు. ఆమె పెళ్లికి పెద్దగా ఖర్చు చేయాలనే ఉద్దేశం లేదని తెలిపారు. ఈ పెళ్లికి పార్టీలోని జాతీయ నేతలను ఆహ్వానిస్తున్నామని, వివాహ ఆహ్వాన పత్రికను మాత్రం అధునాత పరిజ్ఞానంతో తయారు చేశామన్నారు.

తమ స్థాయికి తగ్గట్టుగా మధ్య తరగతి తరహాలోనే వివాహం జరుగుతందని శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణి పెదనాన్న సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ పెళ్లి ఏర్పాట్లుబళ్లారిలోనూ జరుగుతున్నాయన్నారు. జనార్దన్ రెడ్డి నవంబర్ 1న ఇక్కడికి వస్తారని, 10వ తేదీన పెళ్లికూతురిని చేసే కార్యక్రమం చేస్తామన్నారు. తదుపరి మిగిలిన అన్ని కార్యక్రమాలు బెంగళూరులోనే నిర్వహిస్తామన్నారు.

ఇదిలా వుండగా, గాలి జనార్థన్ రెడ్డి కూతరు వివాహానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ లతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు కూడా అతిధుల జాబితాలో వున్నట్లు సమాచారం. అయితే వచ్చే ఏడాది కర్నాటకకు అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈ వివాహానికి హాజరవుతారా..? లేదా..? ఇది పార్టీకి కలసివస్తుందా..? లేదా..? అన్న అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కాగా ఇప్పటి వరకు మాత్రం ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం వెలువడలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gali janardhan reddy  brahmani reddy  invitaion card  PM modi  sushma swaraj  Lokayukta  IT monitors  

Other Articles