పిలిచి మరీ పదవి ఇస్తానన్న ఆ కృష్ణన్నా ఎవరు? | KCR Bumper Offer to Alimineti Krishna Reddy

Kcr bumper offer to alimineti krishna reddy

KCR Bumper Offer to Alimineti Krishna Reddy, Bhuvanagiri Alimineti Krishna Reddy , Alimineti Krishna Reddy KCR, KCR Alimineti Krishna Reddy, KCR Close Aid Key position, Alimineti Krishna Reddy, KCR aids

KCR Bumper Offer to Alimineti Krishna Reddy for his service in TRS.

కేసీఆర్ పిలిచి మరీ పదవి ఇస్తానన్నాడా?

Posted: 10/21/2016 10:14 AM IST
Kcr bumper offer to alimineti krishna reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంటుంది చెప్పండి. ఆయన దృష్టిలో పడ్డారంటే చాలూ వారిని అక్కున్న చేర్చుకుని, అందలం ఎక్కించేస్తుంటారు. కొత్తగా వచ్చేవారినే కాదు.. తనతో మొదటి నుంచి పోరాటంలో ఉన్న వ్యక్తులను మాత్రం అస్సలు మరిచిపోడు. దీనికి నిదర్శనం ఇప్పుడు చెప్పుకోబోయేది.

కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌.. ఏదైనా పదవి కావాలా?' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భువనగిరికి చెందిన టీఆర్‌ఎస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డిని ఆప్యాయంగా అడిగిన తీరు ఆసక్తి రేపుతోంది. బుధవారం యాదాద్రి లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పర్యటించిన కేసీఆర్‌ తిరుగుప్రయాణంలో భువనగిరిలోని కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ సుమారు 30 నిమిషాల పాటు గడిపి వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరుసటిరోజు మధ్యాహ్నం తనతో భోజనానికి రావాలని ఆయన కృష్ణారెడ్డిని ఆహ్వానించారు.

దీంతో కృష్ణారెడ్డి తన కుమారుడు వివేక్‌ రెడ్డిని తీసుకుని మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌ రెడ్డితో కలిసి నిన్న మధ్యాహ్నం భోజనానికి సీఎం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా 'కృష్ణన్నా! మొదటినుంచి నాతో పాటు పనిచేశావ్‌. ఏదైనా పదవి కావాలా?' అని అడిగారంట. బదులుగా కృష్ణారెడ్డి 'మీ ఇష్టం. ఏది ఇచ్చినా తీసుకుంటా' అని సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆపై తెలంగాణ ఉద్యమం తొలి రోజులు, ఆయనతో కలిసి పని చేయటం గురించి ఇరువురు గుర్తుచేసుకున్నారుంటూ మాట్లాడుకున్నారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM KCR  Alimineti Krishna Reddy  Bumper Offer  

Other Articles