వగలాడి వలలో వరుణ్ గాంధీ.? Varun Gandhi caught in honey trap alleges US whistleblower

Was varun gandhi caught in honey trap us whistleblower hints so

Varun Gandhi, Honey Trap, Abhishek Verma, arms deal, BJP Member of the Parliament, bjp mp varun gandhi, varun gandhi honey trap, American whistle-blower, C Edmonds Allen

American whistle-blower C Edmonds Allen has claimed, in a letter to the pm has claimed that Varun Gandhi has been honey trapped by arm dealer Abhishek Verma.

వగలాడి వలలో వరుణ్.. రక్షణ రహస్యాలు పరుల చేతికి..?

Posted: 10/20/2016 08:56 PM IST
Was varun gandhi caught in honey trap us whistleblower hints so

కేంద్ర మంత్రి మేనకా గాంధీ తనయుడు, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ.. వగలాడి వలలో చిక్కుకుని దేశ రక్షణ రహస్యాలను లీక్ చేశారన్న వార్తలు ఇప్పడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.ఈ నేపథ్యంలో ఆయన దేశానికి సంబంధించిన పలు రక్షణ రహస్యాలను లీక్ చేశారంటూ అమెరికా విజిల్ బ్లోయర్  సీ ఎడ్మండ్స్ ఎలెన్ ఏకంగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖ సంచలనంగా మారింది. ఓ వైపు పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ దాడులతో బీజేపి ఉత్సాహంగా ముందుకు కదులుతున్న తరుణంలో వరుణ్ గాంధీ హనీ ట్రాప్ వార్త ఇబ్బందికర పరిణామాంగా మారింది.

వరుణ్ గాంధీ విదేశీ వ్యభిచారిణులతో ఉన్న ఫొటోలతో ఆయనను బ్లాక్‌మెయిల్ చేసి ఈ రహస్యాలను కొందరు సంపాదించారంటూ.. అమెరికాకు చెందిన న్యాయవాది ఎలెన్ సెప్టెంబర్ 16న ఈ ఫిర్యాదు చేశారు. వివాదాస్పద ఆయుధ వ్యాపారి అభిషేక్ వర్మ ఈ వ్యవహారంలో ఉన్నాడని, అతడే వరుణ్ గాంధీని ఉపయోగించుకుని రక్షణ వివరాలను భారతదేశంతో కాంట్రాక్టులు కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తున్న ఆయుధ తయారీదారులకు అందించాడని ఆ లేఖలో పేర్కొన్నారు. 2012 వరకు అభిషేక్ వర్మ, అలెన్ వ్యాపార భాగస్వాములు. పార్లమెంటరీ రక్షణ కమిటీ సభ్యుడిగా వరుణ్ గాంధీకి కొంత సమాచారం తెలుసని, అతడు జాతీయ భద్రతను పణంగా పెట్టి ఈ సమాచారం చేరవేశాడని ఎలెన్ ఆరోపించారు.
 
అయితే ఈ ఆరోపణలను వరుణ్ గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇది ఏమాత్రం ఆధారాలు లేని నాన్సెన్స్ వ్యవహారమని ఆయన కొట్టిపారేశారు. ఈ ఆరోపణలకు ఏమైనా ఆధారాలున్నాయా అని ప్రశ్నించారు. తాను గత 15 ఏళ్లలో ఎప్పుడూ అభిషేక్ వర్మను కలవలేదని చెప్పారు. అలాగే ఎలెన్ చెబుతున్న పార్లమెంటరీ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. తాను వగలాడి వలలో చిక్కుకున్నట్లుగా వాళ్లు చెబుతున్న ఫొటోలు ఏవీ నిజమైనవి కావని, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తన పాత్రను తగ్గించాలన్న దురుద్దేశంతోనే ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
 
మనీలాండరింగ్‌కు, మోసానికి పాల్పడుతున్నారంటూ ఎలెన్, వర్మ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో అప్పటివరకు కొనసాగిన వాళ్ల భాగస్వామ్య వ్యాపారం 2012 జనవరిలో ముగిసిపోయింది. ఆ తర్వాతి నుంచి అభిషేక్ వర్మ మీద పలు ఆరోపణలు చేస్తూ ఎలెన్ తరచు భారతదేశానికి పలు పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు. దాంతో పలు కేసుల్లో అభిషేక్ వర్మను అరెస్టుచేసి కొన్నాళ్లు జైల్లో కూడా పెట్టారు. తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Gandhi  Abhishek Verma  arms deal  Honey Trap  C Edmonds Allen  

Other Articles

Today on Telugu Wishesh