రైల్వే స్టేషన్ లో పోర్న్ వీడియోలు.. ఎందుకో తెలుసా? | Free Wi-Fi at Railway stations used most to watch porn

Free wi fi at railway stations used most to watch porn

Free Wi-Fi at Railway stations India, Free Wi-Fi at Railway stations porn, Porn videos at railwaystations, patna station porn videos

Free Wi-Fi at Railway stations used most to watch porn in India.

ఫ్రీ వైఫైతో బూతు ప్రపంచంలో విహారం

Posted: 10/17/2016 03:56 PM IST
Free wi fi at railway stations used most to watch porn

ఇప్పుడున్న టెక్కీ యుగంలో ఇంటర్నెట్ లేకుండా దాదాపు ఏ పనులు జరగటం లేదు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అంతర్జాలం లేకుంటే అల్లలాడిపోయేవారు చాలా మందే ఉన్నారు. ఆఖరికి ప్రయాణాల్లో కూడా వాటిని వదల్లేని వారు చాలా మందే ఉన్నారు. అందుకే దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో కూడా ఉచిత వైఫై సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం.

అయితే ఫ్రీ గా వస్తుందని వినియోగదారులు అత్యధికంగా దీనిని వేటి కోసం వాడుతున్నారో తెలుసా? ఇంక దేని కోసం పోర్న్ సైట్ల కోసం.. స్టేషన్ లోకి ఇలా ఎంటర్ కాగానే అలా తమ స్మార్ట్ ఫోన్లకు వైఫై కనెక్ట్ చేసేసుకుని బూతు ప్రపంచంలో విహరిస్తున్నారంట. అశ్లీల వీడియోల కోసం తెగ వెతికేస్తూ, వాటిని డౌన్ లోడ్ చేసుకుని చూస్తున్నారు. ఈ విషయంలో పాట్నా రైల్వే స్టేషన్ టాప్ ప్లేస్ లో నిలువగా, ఆపై జైపూర్, బెంగళూరు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లు నిలిచాయి. దేశంలోని వైఫై సదుపాయం ఉన్న స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కువగా అశ్లీల సైట్లను చూస్తున్నారని, కొన్ని చోట్ల సీసీ కెమెరాల్లో కూడా అవి నమోదు అయ్యాయని రైల్ టెల్ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

యాప్ ల దగ్గరి నుంచి సినిమాల డౌన్ లోడ్ కోసం కూడా వైఫైని వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో ఓక్కో యూజర్ కు 1 జీబీ డేటాను ఉచితంగా ఇస్తుండగా, భవిష్యత్తులో దీన్ని 10 జీబీకి పెంచే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇక కేవలం ఇంటర్నెట్ కోసమే రైల్వే స్టేషన్లకు వస్తున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిపోతోందని తెలుస్తోంది. దీని వల్ల వాస్తవ ప్రయాణికులకు నెట్ స్పీడ్ తగ్గిపోతోందన్న ఆరోపణలూ ఉన్నాయి.

కాగా, రైల్ టెల్ ఏపీలోని విశాఖ సహా 23 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లోగా ఈ సంఖ్యను 100కు పెంచుతామని, ఆపై మూడేళ్లలో 400 స్టేషన్లలో తమ వైఫై అందుతుందని రైల్ టెల్ స్పష్టం చేసింది. గూగుల్ తో కలసి పలు కంపెనీలు వైఫై రూటర్లను ఏర్పాటు చేయడం ద్వారా రైల్ టెల్ ఈ సేవలను అందిస్తున్న సంగతి విదితమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Railways  Porn Videos  Free Wifi  

Other Articles

Today on Telugu Wishesh