తండ్రికి వార్నింగ్ లెటర్ పంపాడా? | Team Akhilesh Yadav Warns Mulayam Singh

Team akhilesh yadav warns mulayam singh

Akhilesh Yadav Warns Mulayam Singh, History Spares Nobody, Akhilesh Team warns to Mulayam Singh, SP chief got warn from Son, Akhilesh Team warns Mulayam, Ram Gopal Yadav AkhileshYadav

Team Akhilesh Yadav Warns Mulayam Singh History Spares Nobody.

ములాయంకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగారు

Posted: 10/17/2016 03:28 PM IST
Team akhilesh yadav warns mulayam singh

ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కి ఓ సాలిడ్ వార్నింగ్ వచ్చి పడింది. చరిత్ర చాలా కఠినమైనది. ఎవరినీ క్షమించదు అంటూ ఓ సందేశం ఇప్పుడు ఆయన్ను చేరింది. ఇప్పటికే కుటంబ ముసలంతో సమాజ్ వాదీ పార్టీలో లుకలుకలు పెరిగిపోగా, తాజా హెచ్చరికలతో అవి మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అది పంపింది తనయుడు అఖిలేశ్ సన్నిహితులు.

ఎన్నికలు ముగిసిన తరువాతనే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తామని చెబుతూ, సొంత కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు పార్టీ సుప్రీమ్ ములాయం సింగ్ యాదవ్ ఝలక్ ఇవ్వగా, దానికి ప్రతిగానే అఖిలేష్ వర్గం ఇప్పుడు ఇలా ములాయంకు ఓ లేఖ రాస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రూరులుగా మిగలవద్దని, భవిష్యత్తులో క్షమించలేని తప్పు చేయవద్దని, చరిత్ర ఎవరినీ క్షమించబోదని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఆదివారం ములాయం కార్యాలయంకు అందిన కాస్త ఘాటుగానే హెచ్చరించారు. 403 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలవలేకుంటే, ఓటమి బాధ్యత ములాయం, ఆయన సోదరుడు రాంగోపాల్ యాదవ్ లదేనని హెచ్చరించింది. కుమారుడు అఖిలేష్, సోదరుడు రాంగోపాల్ మధ్య నెలకొన్న విభేదాలు సమసిపోయేలా ములాయం చర్యలు తీసుకుంటున్న వేళ, పార్టీలోని విభేదాలు, కుటుంబ రాజకీయాలు వెలుగులోకి వస్తుండటం ఆ పార్టీని ఇబ్బంది పెడుతున్నాయని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానించారు.

ఇక తమ కుటుంబంలో ఎలాంటి గొడవలూ లేవని, అందరమూ కలసికట్టుగా ఎన్నికలను ఎదుర్కోనున్నామని అటు అఖిలేష్, ఇటు రాంగోపాల్ లు వ్యాఖ్యానించడం గమనార్హం. శివపాల్ యాదవ్ వ్యవహారంతో మొదలైన ఈ సమస్య మధ్యలో సైలెంట్ అయినట్లు కనిపించినప్పటికీ, తాజా లేఖతో మళ్లీ తేనెతుట్టెను కుదిపినట్లయ్యింది. ఇక ములాయం నలుగురి తమ్ముళ్లు తలో మాట ఉండటంతో వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరూ అన్నదానిపై పూర్తిగా గందరగోళం నెలకొన్నట్లు అవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhilesh Yadav team  Warn  letter  SP chief Mulayam  

Other Articles