32 ఏళ్ల తర్వాత 180 కోట్లతో స్మారక స్థూపం | Bhopal gas tragedy victims to get memorial

Bhopal gas tragedy victims to get memorial

Bhopal gas tragedy, Bhopal gas tragedy memorial, 32 years for Bhopal gas tragedy

After 32 years, Bhopal gas tragedy victims to get memorial worth Rs 180 crores.

32 ఏళ్ల తర్వాత 180 కోట్లతో...

Posted: 10/17/2016 10:24 AM IST
Bhopal gas tragedy victims to get memorial

దాదాపు 32 ఏళ్ల అర్థరాత్రి అంతా నిద్రిస్తుండగా జరిగిన ఘోర దుర్ఘటన. వేల మంది మృత్యువాతపడగా, లెక్కలేనంత మంది అవిటితనంతో క్షతగాత్రులుగా మిగిలిపోయారు. ప్రమాదానికి కారణమైన విదేశీ కంపెనీ తూతూ మంత్రంగా నష్టపరిహరం చెల్లించి చేతులు దులుపుకుంది. ఇదంతా భోపాల్ గ్యాస్ ఉదంతం గురించి...

1984 డిసెంబర్ 2-3 తేదీల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి వెలువడిన విష వాయువుల మూలంగా భోపాల్ లో ఎంతో మంది బాధితులుగా మారిపోయారు. అయితే ఇంతటీ ఘోర దుర్ఘటన జరిగిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు మెమొరియల్ కట్టి చేతులు దులుపుకోబోతుందా అన్న పలువురు విమర్శిస్తున్నారు. షిరోషిమా(అణుబాంబు దాడి) ఘటనకు ఏ మాత్రం తీసిపోని ఈ ఉదంతంలో మరిణించిన వారి కోసం ఓ స్మారక స్థూపం కట్టాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి విశ్వాస్ సరంగ్ ప్రకటించాడు. మరో రెండు మూడు నెలలో దీనికి సంబంధించిన పనులు మొదలవుతాయని, ఇందు కోసం 180 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్లు తెలిపాడు.

క్షతగాత్రుల కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని, ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్దిని శంకించాల్సిన అవసరం లేదని ఆయన అంటున్నాడు. మరోవైపు బాధితుల కోసం ఉద్యమం చేస్తున్న భోపాల్ గ్యాస్ పీడిత మహిళ ఉద్యోగ సంఘం మెమోరియల్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ కి కృతజ్నతలు తెలిపాయి.

అయితే ప్రమాద సమయంలోనే కాదు, దాని ప్రభావంతో గత రెండు దశాబ్దాలుగా మరణించిన వారికి కూడా స్థూపాలను నిర్మించాలని బీజీపీఎంయూఎస్ డిమాండ్ చేస్తోంది. బాధితులకు నష్టపరిహారం కోసం సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం క్యూరేటివ్ పిటిషన్ వేయాలని కూడా వారు కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhopal gas tragedy  Memorial  Madhya Pradesh Government  

Other Articles