మళ్లీ వివాదాన్ని రాజేసిన రాధేమా Radhe Maa sparks row, visits Har-ki-Pauri wearing shoes

Radhe maa sparks row visits har ki pauri wearing shoes

Radhe Maa, Godwoman, Har-ki-Pauri, Haridwar, Priests, Radhe maa in haridwar, Radhe maa controversy, real face of radhe maa, radhe maa dance, Radhe Maa haridwar controversy

The self-styled god-woman Radhe Maa visited Har-ki-Pauri, a famous ghat on the banks of the Ganga river in Haridwar, wearing sneakers

ITEMVIDEOS: మళ్లీ వివాదాన్ని రాజేసిన రాధేమా

Posted: 10/17/2016 10:15 AM IST
Radhe maa sparks row visits har ki pauri wearing shoes

దైవాంశ సంభూతురాలిగా తనకు తానుగా ప్రచారం చేసుకుని భక్తుల విశ్వాసాలు, నమ్మకాలతో అడుకుంటూ కోట్ల రూపాయలను వెనకేసుకుని, పలువురి నమ్మించి మోసం చేసిన రాధేమా.. మరోమారు వార్తల్లో నిలిచింది. ఒక యోగినిగా వుండాల్సిన అమె భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోయి.. కురచ దుస్తులతో అసభ్య నృత్యాలు చేస్తూ వార్తల్లోకి ఎక్కి రచ్చచేసిన రాధేమా.. తనకు వివాదాలకు విడదీయరాని బంధముందని రుజువు చేసుకుంది.

ఆలయ ఆచారాలను పాటించేందుకు తాను అతీతురాలిని అని భావించిందో.. భక్తుల విశ్వాసాలతో అడుకోవడం సరదా అని భావించిందో తెలియదు కానీ మళ్లీ అలాంటి చర్యలకే పాల్పడింది. హరిద్వార్ కు వచ్చిన ఆమె, గంగానదీ తీరంలోని హరీకీ పౌరీ ఆలయానికి షూ ధరించి వచ్చి పూజలు చేసింది. ఈ ఆలయంలోకి షూ, చెప్పులు ధరించి వెళ్లకూడదు. కానీ, రాధేమా మాత్రం ఎరుపురంగు దుస్తుల్లో ధగధగలాడుతూ, అదే రంగు షూ వేసుకుని వచ్చి, గంగానదికి పాలాభిషేకం చేసి, బ్రహ్మకుండ్ లో పూజలు చేసి దైవాంశసంభూతురాలిగా అపచారాలకు తెరతీసింది.

ఈ విషయం అ నోట ఈ నోట తెలుసుకున్న యువతీర్థ్ పురోహిత్ మహాసభ, రాధేమా చర్యలను తీవ్రంగా పరిగణించింది. అమెను ఇకపై అలయంలోకి రానివ్వబోమని, అమెపై హరీ కీ పౌరీ ఆలయంలోకి రాకుండా నిషేధం విధిస్తున్నామని ప్రకటించింది. షూతో వచ్చి ఆమె లక్షలాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. ఇదిలావుండగా, హరీకీ పౌరీలో తన అనుచరులను ఉద్దేశించి ప్రసంగిచాన రాధేమా ఎట్టకేలకు నిజాన్ని అంగీకరించింది. తానేమీ దైవాన్ని కాదని, సాధారణ మహిళనని, ప్రజలు తమ తల్లిదండ్రులను గౌరవించాలని అనుభాషణం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhe Maa  Godwoman  Har-ki-Pauri  Haridwar  Priests  

Other Articles