కేటీఆర్ ఓ బచ్చా... అంత సీన్ అవసరమా? | Congress senior leader VH fire on KTR

Congress senior leader vh fire on ktr

KTR V Hanumantha Rao, KTR VH, KTR failed as Minister, KTR US tour

Congress senior leader VH slammed KTR about Hyderabad Damage.

కేటీఆర్ కు అంత సీన్ ఎందుకువోయ్...

Posted: 10/13/2016 08:55 PM IST
Congress senior leader vh fire on ktr

కేసీఆర్ వారసత్వ పోరులో మేనల్లుడు, సీనియర్ నేత అయిన హరీష్ రావు స్వచ్ఛందంగా తప్పుకోగా, నెక్స్ట్ కిరీటం కేటీఆర్ దేనని పార్టీలో కొందరు కీలకనేతలు అప్పుడే ఫిక్సయ్యారు. అందుకే గ్రేటర్ బాధ్యతలతోపాటు, కొన్ని కీలకమైన శాఖలను కూడా తనయుడికే అప్పజెప్పాడని, ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వారికి వారే సముదాయించుకున్నారు కూడా. అయితే మొన్నటి వర్షాలకు హైదరాబాద్ ఛిన్నాభిన్నం అయిన విషయాన్ని ఆసరాగా తీసుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ కేటీఆర్ పై ఎక్కేస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ తోపాటు, పార్టీలోని మంత్రులందరినీ దద్దమ్మలంటూ కాస్త ఘాటైన పదజాలాన్నే వాడుతుంది. ఇలాంటి విమర్శలలో ముందుండే సీనియర్ నేత వీహన్మంతరావు కూడా కేటీఆర్ పై ఈ విషయంలో అసహనం ఎలా ప్రదర్శించాడో చూడండి.

అసలు కేటీఆర్ కు అన్నేసి శాఖలు ఇవ్వటం అవసరమా? అంటూ వ్యాఖ్యానించాడు. తెలంగాణ పంచాయతీరాజ్, ఐటీ, మున్సిపల్ శాఖా ఇలా కేటీఆర్ ఒక్కడికే అన్ని శాఖలు ఎందుకు? అని వీహెచ్‌ ప్రశ్నించాడు. రాజధానిలో కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, నాలాలు బాగుపడలేదు. ఇదే సమయంలో మంత్రి కేటీఆర్ విదేశాలకు చెక్కేయటం ఏంటని ప్రశ్నించాడు.

కేటీఆర్ ఇప్పటిదాకా చాలాసార్లు నగరంలో పర్యటించాడు. స్వయంగా మున్సిపల్ మంత్రి పొజిషన్ లో ఉండి చెప్పినా అధికారుల్లో స్పందన లేదు. అది అతని కెపాసిటీ. అందుకే నగర గల్లీ గల్లీ తెలిసిన స్థానిక మంత్రులకు, కాస్త మొండిఘటాన్ని మున్సిపల్ శాఖను కేటాయిస్తే మంచిదని వీహెచ్ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి రోడ్లు చూస్తే పెట్టుబడిదారులు వస్తారా? అని తనకు ఆందోళనగా ఉందని, తక్షణమే కేటీఆర్ ను కీలక బాధ్యతల నుంచి తప్పించాలని సూచిస్తున్నాడు. అదే సమయంలో తెలంగాణలో జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆగిపోకుండా, ఏర్పాటు చేసిన జిల్లాలకు ఆర్థికసాయం కూడా చేయాలంటూ కోరాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Leader  V Hanumantha Rao  KTR  US tour  

Other Articles