ఫోటోలకు ఫోజులిచ్చి దిగితుండ్రు.. నిజం తెలిసి పరువు పోయే.. netzens comments on Tdp former mp gadde ram mohan photo

Netzens comments on tdp former mp gadde ram mohan photo

TDP, Tdp technology, techno classes, gadde rammohan, vijayawada training classes. chandrababu naidu, Andhra pradesh, Nara lokesh, TDP leader posing photo

In a bizzare incident, former tdp mp photo draws netzens comments, as it looks like he doesn't swotch on the monitor but gives a pose to camera

ఫోటోలకు ఫోజులిచ్చి దిగితుండ్రు.. నిజం తెలిసి పరువు పోయే..

Posted: 10/08/2016 03:59 PM IST
Netzens comments on tdp former mp gadde ram mohan photo

లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే అన్న పాటు లో రెండో చరణం.. ప్రజల వద్ద పాలనని ఊరూరికి తిరుగుతుండ్రు.. ఎన్నడు రానీ అఫీసరు గుడిసె ముందుకు వచ్చిండు.. కడుపుల సల్ల కదలకుండా కారు మీద వచ్చిండు.. శ్రమదానం పేరుతోటి పలుగు పార పట్టిండ్రు.. అంగిస్తరు చెడకుండా తట్ట నెత్తికెత్తుకుండు.. పేపర్లో ఫోటోలకి.. (మీడియాలో కవరేజీకి) ఫోజులిచ్చి దిగుతుండ్రు.. లచ్చులో లచ్చన.. అంటూ సాగిన ఈ పాట దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపోందించిన ఒసేయ్ రాములమ్మ సినిమాలోనిదన్న విషయం అందరకీ తెలిసిందే.. అయితే ఈ  పాటలో దాసరి చెప్పినట్లుగానే టీడీపీ నేతల వ్యవహార శైలి వుందన్న వాదన అప్పడు.. ఇప్పుడు కూడా వ్యక్తం అవుతుంది, ఇందుకు కారణం కేవలం ఒకే ఒక్క ఫోటో. TDP

తాజాగా విజయవాడలో టీడీపీ నేతలకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వ్యవహారంలో ఇలాంటి పొరపాటే జరిగింది. పాలనకు టెక్నాలజీని ఎలా జోడించాలనే విషయమై టెక్ విద్యార్థుల చేత టీడీపీ నేతలకు అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పాఠాలు చెప్పించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి  సంబంధించిన కొన్ని ఫోటోలను టీడీపీ బయటకు విడుదల చేసింది. అయితే అసలు మానిటర్ కూడా ఆన్ చేయకుండానే.. కంప్యూటర్ పాఠాలు నేర్చుకుంటున్నట్లుగా ఉన్న టీడీపీ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ ఫోటోపై ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్లు సెటైర్లు విసురుతున్నారు.

మానిటర్ కూడా ఆన్ చేయకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఇలా ఫోటోలకు పోజులిచ్చారంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. రీస్టార్ట్ చేసి వేచి చూస్తున్నారా..? లేక సిస్టమ్ రీబూట్ అయ్యిందో తెలియదు కానీ.. తెలిసి జరిగినా, తెలియక జరిగినా మొత్తానికి టీడీపీ శిక్షణా తరగతుల వ్యవహారంపై నెటిజెన్లు మాత్రం మండి పడుతున్నారు. శిక్షణ ఇచ్చే విద్యార్థి మౌస్ పట్టుకుని గద్దె రామ్మోహన్‌కు టెక్ పాఠాలు చెబుతున్నట్లుగా ఆ ఫోటోలో కనిపిస్తోంది. అయితే కేవలం అది ఫోటో‌కు ఫోజే గానీ మానిటర్ ఆన్ చేయకుండానే పాఠాలంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles