ఎన్టీవీ ఛానెల్ ఇంటర్వ్యూతో చిక్కుల్లో ఏపీ స్పీకర్ | AP speaker Kodela booked with comments on Election Fund

Ap speaker kodela booked with comments on election fund

AP speaker Kodela booked with comments on Election Fund, Kodela Election Fund Comments, AP speaker on Election Fund, Kodela Ntv interview, Kodela controversary interview

AP speaker Kodela booked with comments on Election Fund in an Interview.

ఆ ఛానెల్ ఇంటర్వ్యూతో అడ్డంగా బుక్కయిన కోడెల

Posted: 10/05/2016 03:45 PM IST
Ap speaker kodela booked with comments on election fund

ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కు చిక్కులు తప్పేలా కనిపించడం లేదు. ఎన్నికల్లో డబ్బులు ఖర్చుపెట్టి ఓట్లు కొనుగోలు చేశానని స్వయంగా ఒప్పుకున్నట్లు ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు కోడెలను ఇరకాటంలో పడేసింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుపై 924 ఓట్లతో కోడెల గెలుపొందిన విషయం తెలిసిందే. ఆపై స్పీకర్ గా నియమితులయ్యారు కూడా.

కాగా, ఈ యేడాది జూన్ 19న ఓ ప్రైవేట్ చానెల్ ముఖాముఖి ప్రోగ్రాంకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో ఎన్నికల ఖర్చు గురించి ప్రస్తావిస్తూ... 1983 లో తాను నర్సారావుపేట నుంచి పోటీ చేసిన సమయంలో కేవలం 30 వేలు మాత్రమే ఖర్చు చేశానని, కానీ, 2014 ఎన్నికల సమయంలో మాత్రం తనకు 11.50 కోట్లు ఖర్చయ్యిందని పేర్కొన్నాడు. అంతే ఆ స్టేట్ మెంట్ తన గొయ్యి తానే తీసుకున్నట్లు అయ్యింది.

ఎన్నికల నిబంధనల ప్రకారం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థి రూ.28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఉంది. అలాంటి వాటిని అతిక్రమించి ఏకంగా 28 లక్షలు ఖర్చు చేయటం ఏంటన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ విషయంపై రెండు రోజుల తర్వాత నర్సరావుపేట కాంగ్రెస్ నేత, ప్రముఖ న్యాయవాది అలెగ్జాండర్ సుధాకర్ రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాడు.

రాష్ట్రపతి భవన్ నుంచి కేంద్ర హోంశాఖకు ఆదేశాలు వెళ్లటం అక్కడ పూర్తి పరిశీలనల తర్వాత నిన్న(మంగళవారం) భారత ఎన్నికల కమిషనర్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ విషయంపై ఆదేశాలు అందాయి. చర్యలు తీసుకున్నాక తిరిగి వివరాలను తమకు తెలియజేయాలని రాష్ట్రపతి కార్యాలయం అందులో పేర్కొంది. మొత్తానికి ఏదో మాట్లాడాలన్న ఆత్రుతంలో చేసిన వ్యాఖ్యలతో కోడెల అడ్డంగా బుక్కయినట్లు స్పష్టం అవుతోంది. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింకు క్లిక్ చేయండి

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP speaker  Kodela siva prasad rao  Election Fund  Interview  

Other Articles