అమరావతిలో రియల్ ఎస్టేట్ తో కోట్లు కొల్లగొట్టిన ఏపీ మంత్రి ? | AP minister tax evasion in Real estate at Amaravathi

Ap minister tax evasion in real estate at amaravathi

AP minister tax evasion in Real estate, Amaravathi Real Estate, IT eyed on Andhra Pradesh politicians, IT Raids on AP leaders, TDP leaders in IT raids

AP minister tax evasion in Real estate at Amaravathi.

రియల్ ఎస్టేట్ మంత్రికి చుక్కలు చూపించబోతున్నారా?

Posted: 10/05/2016 09:34 AM IST
Ap minister tax evasion in real estate at amaravathi

ఆంధ్రప్రదేశ్ లోని ఓ మంత్రి ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ దృష్టిసారించినట్టు సమాచారం. ఒక మంత్రికి చెందిన ఆదాయ వివరాలపై కన్నేసిన ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు ఏపీ రాజధాని అమరావతి కేంద్రంగా ఐటీ దాడులు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఆ మంత్రి అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు తెలియడంతో, ఆయన జరిపిన లావాదేవీలపై ఐటీ శాఖ నిఘా పెట్టింది. ఈ మేరకు సమాచారం సేకరించిన ఐటీ శాఖ ఉన్నతాధికారులు దాడులు చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఈనెల 15న ఢిల్లీలో ఐటీ కమిషనర్ల సమావేశం అనంతరం అమరావతిలో ఈ మేరకు దాడులు చేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. నిజానికి సెప్టెంబర్ 30 వరకు కేంద్రం ఇచ్చిన గడువుతో నేతలు, బడాబాబులు స్వచ్ఛందంగా తమ బొక్కలు బటయపెడతారని అనుకోగా, అది జరగలేదు.

ఇదిలా ఉంటే నవ్యాంధ్ర రాజధాని సమీపంలో రియల్ ఎస్టేట్ పుంజుకోవటంతో బ్లాక్ మనీ భారీగా బయటపడే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా సీఆర్డీఏ పరిధిలో సుమారు 40 వేల కోట్ల రూపాయల స్కాం జరిగి ఉంటుందన్న అనుమానాలతోపాటు, అందుకు సంబంధించి ఓ మంత్రి హ్యాండ్ ఉన్నట్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే మోదుగుల వేణుగోపాలరెడ్డి, సత్యప్రభల వ్యాపారాలపై దృష్టిసారించి, బారీగా సొమ్మును బయటపెట్టిన అధికారులు, మిగతావారి వివరాలతో ఒక నివేదిక సిద్ధం చేశారు. జాతీయ స్థాయి సమీక్ష సమావేశంలో అనుమతి లభించగానే ఒకసారి ఐటీ దాడులు చేసేందుకు సిద్ధమైపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  IT raids  key Leaders  

Other Articles